బంగారం ధర మళ్లీ పడిపోయింది

ఈ రోజు బంగారం ధర మళ్లీ పడిపోయింది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో పది గ్రాముల ధర రు. 400 తగ్గి రు. 35,400 లకు దిగింది. నిన్న ఒకే రోజు రు 900 పెరిగి రికార్డు సృష్టించింది.అయితే, అది నిలబడలేక పోయింది.
అంతర్జాతీయంగా బంగార కొనుగోళ్లకు మార్కెట్ కు అనుకూలంగా ఉన్నా దేశీయంగా జ్యుయలర్స్ దగ్గిర నుంచి డిమాండ్ తగ్గడంతో ధర లు పడిపోయాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది.
బంగారు తో పాటు వెండి ధరలు కూడా తగ్గు ముఖం పట్టాయి. కిలోధర రు. 125 తగ్గి రు. 39,075 చేరింది. అంతర్జాతీయంగా (న్యూయార్క్) స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర $ 1,409.40 దగ్గిర ట్రేడ్ అవుతూఉంది. కిలో వెండి $15.21 ధర పలికింది.
జాతీయంగా దేశ రాజధానిలో 10 గ్రాముల 99.9 శాతం ప్యూర్ గోల్డ్ ధర రు. 35,400 పలికితే, 99.6 శాతం ప్యూర్ గోల్డ్ ధర రు. 35,230 దగ్గిర స్థిరపడింది.