మూసివేత దిశగా షిరిడీ సాయిబాబా ఆలయం… కొత్త వివాదం

మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయం కొత్త వివాదంలో చిక్కుకున్నది. ఆ ఆలయం మూసివేత దిశగా మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. సాయిబాబా జన్మస్థలం పాత్రి అని దానికి 100 కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేస్తామని మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ ఠాక్రే ప్రకటించిన నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది. ఇక షిరిడీలో ఉన్న సాయిబాబా ఆలయాన్ని మూసివేసే దిశగా ఆలయ పాలక మండలి సభ్యులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పాత్రి లో దేవాలయాన్ని అభివృద్ధి చేసినా షిరిడీలో ఉన్న ఆలయానికి వచ్చిన ముప్పేమీ లేదని కొందరు భక్తులు ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. దేశమంతా సాయిబాబా ఆలయాలు అభివృద్ధి అవుతున్న దశలో షిరిడీలో ఉన్న ఆలయాన్ని మూసివేసే ప్రసక్తే ఉండబోదని అంటున్నారు. వదంతులను నమ్మాల్సిన పనిలేదని చెబుతున్నారు. రేపటిలోగా దీనిపై మరింత స్పష్టత వస్తుందని హైదరాబాద్ కు చెందిన ఒక సాయి భక్తుడు ట్రెండింగ్ తెలుగు న్యూస్ కు వెల్లడించారు.