సుప్రీం కోర్టు లైంగిక వేధింపుల బాధితురాలి గోడు…

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ మీద వచ్చిన  లైంగిక వేధింపుల వ్యవహారం అంత సులభంగా సమసిపోయే వివాదంలాగా కనిపించడం లేదు.

కోర్టులో గతంలో పనిచేసిన ఒకమహిళా ఉద్యోగి చేసిన ఫిర్యాదు మీద విచారణ జరిపిన జస్టిస్ ఎస్ ఎ బాబ్డే కమిటీ ఫిర్యాదు లో పస లేదని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, ఇది ఈ రోజు నిరసన ప్రదర్శనకుల దారి తీసింది. అనేక మంది న్యాయవాదులు, ప్రజలు కూడా  ఈ విచారణ జరిగిన తీరుకు నిరసన తెలుపుతూ సుప్రీం కోర్టు ముందు ప్రదర్శన జరిపారు. కోర్టు పరిసరాలలో 144 సెక్షన్ విధించారు.

ఇది ఇలా ఉంటే బాధితురాలు కూడా తన నిరసన వ్యక్తం చేశారు.  సుప్రీంకోర్టు కు ఒక లేఖ రాస్తూ తన జస్టిస్ బాబ్డే  నివేదిక తేల్చిన విషయం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివేదికలో ఏముందో తెలుసుకునే హక్కు తనకు ఉందని, అందువల్ల నివేదికను తనకు అందించాలని కూడా ఆమె కోర్టును కోరారు.

సహజ న్యాయానికి సంబంధించి కనీస మర్యాదలు కూడా కమిటీ పాటించనందున జస్టిస్ బాబ్డే కమిటి  విచారణనుంచి తాను విరమించకున్నా, తాను చేసిన ఫిర్యాదులో పస లేదని కమిటీ చెప్పడం తనను షాక్ కు గురించేసిందని ఆమె లేఖ లో పేర్కొన్నారు.
” I am shocked that committee has come to an adverse finding against me despite the fact that I was compelled to withdraw from the commiitee since the commjittee did not observe even the mosgt basic priniciple of natural justice,” అని అమెలేఖలోరాశారు.

ఇదే విధంగా విచారణ నివేదిక కాపిని తనకు అందివ్వాలని కూడా ఆమె కోరారు.

ఈ విచారణ నివేదిక ప్రతిని పొందడం తన హక్కు అని కూడా ఆమె పేర్కొన్నారు.

కమిటీ తెల్చిన విషయం వెనక కారణాలను, సాక్ష్యులు,లేదా ఇతరలు సమర్పించిన సమాచారంతో పాటు కమిటీ పరిశీలించిన ఇతర సాక్ష్యాధారాలు కూడా నాకు అందాలి. దీనితోపాటు, మీడియాలో వస్తున్నట్లు, ఫిర్యాదు ఎదుర్కొంటున్న ప్రధాన న్యాయమూర్తికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నివేదికను సమర్పించినపుడు ,దాని ప్రతిని పొందేందుకు నాకు అర్హత ఉంది,’ అని ఆమె పేర్కొన్నారు.

” I have a right to the report, the reలson for the same as well as copies of the depositions of any witnesses, any other persons or any other evidence considered by the comచittee. Besides this, as is being reported iby the media, if a copy of the report is being given to the cCJI diretly or indirectly I am enittled to a copy of thereof in any case, ” ఆమె పేర్కొన్నారు.

ఆమె రాసిన లేఖ స్క్రిబిడ్ లో ఉంది. చూడవచ్చు.

 

Final Letter to Committee b… by on Scribd

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *