టీ చాాలా గమ్మత్తయిన తేనీయం.
కులాలకు,మతాలకు, పార్టీలకు, భాషలకు , ప్రాంతాలకు,టైమింగ్ కు అతీతంగా పెరిగి ఆసేతు హిమాచలం విస్తరించిన పానీయం.
టీ తాగకుండా పూటగడవడం చాలా కష్టం. టీ ప్రపంచానికి పగలు రాత్రిలేదు. నలుగురు కలసి మాట్లాడుకోవాలంటే టీ, ఒక్కడికి ఎమీ తోచక బోర్ కొడుతుంటే టీ, సినిమా విరామంలో టీ, చదవుతూ టీ, టివిచూస్తూటీ, ప్రయాణిస్తూ టీ, నిద్ర పోవడానికి టీ, ఉల్లాసానికి టీ… ఇలా టీ సేవనం భారత దేశంలో పెరిగి పెరిగి ఏమయిందో తెలుసా, ప్రపంచంలో అత్యధికంగా టీ తాగే దేశం ఇండియా అయింది. ఇపుడు జింజర్ టీ,హెర్బల్ టీ, లెమన్ టీ, శాఫ్రాన్ టీ… ఇలా రకారకాల టీలు దొరుకుతున్నాయి.
ప్రపంచంలో టీ ఉత్పత్తిలో రెండో దేశమయినా, ఇండియా ఉత్పత్తిలో 80 శాతం దేశావసరాలకే వాడాల్సి వస్తుంది. ఇండియా జనాభాలో 64 శాతం మంది టీ తాగుతారు. టీ తాగనిదే రోజు ప్రారంభించని వాళ్లున్నారు. గంట గంటకు టీ తాగే వాళ్ల దగ్గిర నుంచి గంటకు రెండు మూడు కప్పు లు లాగించేవాళ్ళున్నారు. నా మిత్రుడొకరికి టీ తాగితే గాని దినం మొదలు కాదు. ఒకసారి ఊరుగాని ఊరేళ్లాం. పొద్దునే పనుల్లోకి దూకాలి. మావాడి కేమో టీ పడితే గాని తెల్లవారదు. ఓ పాట సైకిల్ సంపాయించి 4 కిమి దూరాన వుండే ఒక ఉరికెళ్లి టీ లాంటిది తాపించి తెల్లవార్చాల్సి వచ్చింది. ఇండియాలో టీ చుట్టు ఒక అద్భుతమయిన కల్చర్ డెవెలప్ అయింది. దాని సంగతి మరొక సారి చూద్దాం.
శాంతి దూతకు నోబెల్ శాంతి బహుమతి ఎందుకు రాలేదు? కారణాలివే!
ఇలాంటి టీ తయారీలో మెలకువలు తెలుసుకుని ఒక పంజాబీ లాయరమ్మ ఆస్ట్రేలియాలో టీ దుకాణం తెరచి అదరగొట్టింది. పే…ద్ద టీ వ్యాపారయిపోయింది. న్యాయ శాస్త్రం చదివి, న్యాయవాద వృత్తి చేస్తూన్నా ఆమెకు టీ తయారీ మీద, టీ అమ్మకం మీద మక్కువ ఎక్కువ. అందుకే దాన్ని చంపుకోలేకపోయింది. టీ అమ్మి తానే అందరికి సర్వ్ చేసి లేడీ టీ సెల్లర్ (చాయ్ వాలీ) అయిపోయింది. చివరకు అది విస్తరించి కోట్ల బిజినెస్ గా మారిపోయింది. ఆస్ట్రేలియా వాళ్లకి ఇండియన్ టీ పరిచయం చేసి కోటీశ్వరుల జాబితాకెక్కిన ఈ లాయరమ్మ పేరు ఉప్మా విర్ది.
టీ, చాయ్ అనే మాటలెలా వచ్చాయో తెలుసా?
టీ అమ్మి ఉప్మా అస్ట్రేలియా సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమన్ అయ్యారు. ఆమె న్యాయవాది అయినా సరే, పార్టీల కోసం స్వయంగా టీ తయారు చేస్తారు. తానే స్వయంగా కప్పులలో అందిస్తారు. ఇందులో సంకోచం లేదు.
ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో ఉద్యోగం చేస్తున్నపుడే 2014లో ఆమె టీ అమ్మడం మొదలుపెట్టారు. టీ మీద ఆమె ఇంత మక్కువ ఎలా వచ్చిందంటే దానికి కారణం తన తాతగారని చెబుతుంది.
ఆయన ఆయుర్వేద వైద్యుడు. మూలికలు, సుగంధ ద్రవ్యాల మిక్సింగ్ లో ఆయుర్వేద వైద్యుడిని మించిన వాళ్లెవరుంటారు. ఈ ఫార్ములాను ఉప్మా టీ కి అప్లై చేసింది. ఆయన తన క్లినిక్ లో హెర్బల్ టీ తయారు చేసేవాడట. తయారు చేసే గమ్మత్తును ఆయనే నేర్పాడని ఉప్మాచెబుతుంది.
దానికి తోడు సొంతూరు చండీగడ్ లో ఇంట్లో టీ చేసే బాధ్యత కూడా ఆమె మీదే పడింది. ఇంట్లో ఎవరొచ్చినా, ఉప్మా కొంచెం టీ పెట్టమ్మా అనే వాళ్లు. టీ తాగాలనుకున్నపుడల్లా వాళ్లమ్మా నాయన కూడా , ఉప్మా కొద్ది టీ కలపమ్మా అనే వాళ్లు. ఇలా ఉప్మాకి టీ తయారీలో పట్టు వచ్చేసింది. వాళ్ల న్నయ్య పెళ్లిలో వేల కప్పుల టీ తయారుచేసేబాధ్యత కూడ ఆమెయే తీసుకుని అందరు అవాక్కయ్యేలా చేసింది.
‘ ఎవరొచ్చినా టీ చేసే బాధ్యత నాదే. టీ అందరిని దగ్గరకు చేర్చే మంత్రజలం’ అంటుంది ఉప్మా.
ఇండియా వాళ్లెక్కడున్న అక్కడ టీ అవసరముంటుంది. సంతోషమయినా, విషాదమయినా తాగడానికి వెనకకాడనీయని పానీయం టీ ఒక్కటే. ఆస్ట్రేలియాలో ఇండియన్లందరిని కలిపేందుకు టీ ని ప్రయోగించాలనుకుందామే. దానికి తోడు అప్పటికి మెల్బో ర్న్ లో మాంచి ఇండియన్ టీ హోటళ్లే లేవు.
అక్కడే ఆమె టీ బిజినెస్ ఐడియా మొలకెత్తింది.
అంతే, ఇండియన్ టీ తయారుచేయడం మొదలు పెట్టింది.
భారతీయులంతా ఆమె టీ చుట్టూ చేరి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మెల్ బోర్న్ లో ఇండియన్ టీ కల్చర్ మొదలయింది.
ఆమెనే టీ ప్లాస్క్ టీ కప్పులు తీసుకుని మార్కెట్ లలో టీ అమ్మేందుకు పరుగులు తీసేది.తనకు తెలిసిన ఆయుర్వేద ఓషధులను, సుగంధ ద్రవ్యాలను జోడించి రకరకాల టీ లు తయారు చేసింది మెల్ బోర్న్ వీధుల్లో టీ గుభాళించేలా చేసింది.
సలసల మరిగే ఆహ్లాదకరమయిన టీ సువాసన మెల్లిగా భారతీయులనుంచి అస్ట్రేలియా ప్రజలకు అంటుకుంది.
తర్వాత తాను తయారుచేసిన టీ ప్లస్ సుగంధ ద్రవ్యాల, ఓషధుల మిశ్రమాన్ని ప్యాక్ చేసి ఇండియన్లకు అమ్మడం మెుదలుపెట్టారు.
తర్వాత ఆన్ లైన్ స్టోర్ మొదలయింది. లోకల్ స్టోర్స్ కు కూడా దీనిని సప్లయ్ చేయడం మొదలుపెట్టారు. గత నాలుగు సంంవత్సరాలలో ఆమె టీ బిజినెస్ తారాస్థాయికి చేరుకుంది. లాయరే అయినా ఆమెకు టీ తో లెక్కలేనంత గుర్తింపు వచ్చింది.
2017లోనే ఫోర్బ్స్ అండర్ 30 వ్యాపారవేత్తల జాబితాకెక్కాడు.2017లో ఆస్ట్రేలియా ఫుడ్ అండ్ బెవరేజెస్ అవార్డు వచ్చింది. హింద్ రతన్ నాన్ రెసిడెంటో ఇండియన్ అవార్డు వచ్చింది.
చివరి కప్పు చాయ్ కి పిలుస్తున్న హైదరాబాద్ ఇరానీ కేఫె
ఇండియా అస్ట్రేలియా బిజినెస్ కమ్యూనిటీ ఇచ్చే బిజినెస్ ఉమన్ అఫ్ ది ఇయర్ అవార్డు 2016లోనే వచ్చింది. అదేఏడాది విక్టోరియన్ సిక్ అసోషియేసన్ ఆమెకు 2016బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డు నిచ్చింది.
తన వ్యక్తి గత సంబంధాలు, సోషల్ మీడియా మార్కెటింగ్ లతో కష్టపడి తన బ్రాండ్ ‘ చాయ్ వాలీ’ ని సక్సెస్ చేసింది.
ఆస్ట్రేలియా నిజానికి కాఫీ దేశం . అయితే, అక్కడ కూడా టీ విస్తరిస్తూఉంది. కాఫీకి టీ ప్రత్యామ్నాయమవుతూ ఉంది. ఇలాంటి పరివర్తన దశలో ఉప్మా చేతి టీ మార్కెట్ విజేత అయింది.
టీ ద్వారా భారతీయ సంస్కృతిని ఆస్ట్రేలియా ప్రజలకు పరిచయం చేయడమే తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు. ఇపుడా మంచి టీ తయారు చేయడమెలాగో ప్రజలకు నేర్పించేందుకు ‘ The art of Chai’వర్క్ షాపులను కూడా నిర్వహిస్తున్నారు.
ఇంతగా టీ గోల పెరిగినా ఆమె న్యాయవాద వృత్తిని వదల్లేదు.నిజానికి ఆమె పేరెంట్స్ కు ‘ఆడపిల్ల ఇలా టీ అమ్మడమేంట’నే అయిష్టత ఉంది. ‘లాయరయుండి ఈ టీ అమ్మడేమేంటమ్మా’ అని వాళ్లంటూనే ఉన్నారు.
అయితే, టీ తోనే ఒక మిరకిల్ చేయబోతున్నా, టీ తోనే ఏదో సాదిద్దామనుకుంటున్నా నని ఆమె టీ కాంచడం ఆపడం లేదు.
ఆమెకు టీ తో లెక్కలేనంత గుర్తింపు వచ్చింది. 2017లోనే ఫోర్బ్స్ అండర్ 30 వ్యాపారవేత్తల జాబితాకెక్కాడు.2017లో ఆస్ట్రేలియా ఫుడ్ అండ్ బెవరేజెస్ అవార్డు వచ్చింది. హింద్ రతన్ నాన్ రెసిడెం్ ఇండియా అవార్డు వచ్చిందది. ఇండియా అస్ట్రేలియా బిజినెస్ కమ్యూనిటీ ఇచ్చే బిజినెస్ ఉమన్ అఫ్ ది ఇయర్ అవార్డు 2016లోనే వచ్చిందది. అదేఏడాది విక్టోరియన్ సిక్ అసోషియేసన్ ఆమెకు 2016బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డు నిచ్చింది.
(ఫీచర్ ఫోటో Istagram నుంచి)