రాహుల్ కు బిజెపి రు. 9 కోట్ల ‘చిక్కు‘ ప్రశ్న

ఎన్నికల ఆఫిడవిట్  ఆధారంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ అమేధీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీకి  ఒక ’చిక్కు’ ప్రశ్న వేసింది.

ఈ ప్రశ్నతో రాహుల్ గాంధీ కూడా చోర్ అని ప్రూవ్ అవుతందని బిజెపి భావిస్తూ ఉంది.

ఎందుకంటే, రాఫేల్ యుద్ద విమానాలు కొనుగోలు వ్యవహారంలో రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి వేసిన‘చౌకీ దార్ చోర్ హై’ ముద్ర బాగా అతుక్కుపోయింది. దానిని కడిగేసుకోవడం కష్టం. ఈ మాట చుట్టు ఎన్ని వార్తలొచ్చాయో, ఎంతవిశ్లేషణ జరిగిిందో లేక్క లేదు. చివరకు ప్రధాని మోదీ ట్విట్టర్  హ్యాండిల్ ను కూడా చౌకీదార్ అని మార్చుకోవలసి వచ్చింది. ఇలాగే రాహుల్ గాంధీ కూడా అవినీతి పరుడని ముద్రవేసేందుకు  బిజెపి ఒక మాంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంది.

రాహుల్ గాంధీ అమేధీకి నామినేషన్ వేస్తూ దాఖలు చేసిన సమర్పించిన ఆస్తిపాస్తుల వివరాల  అఫిడవిట్ లోని లెక్కలు   ఆ అవకాశమని బిజెపి  భావిస్తూ ఉంది.

వెంటనే కేంద్ర న్యాయ శాఖ మంత్రి, న్యాయవాది మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను రంగంలోకి దించింది.

రాహుల్ ఆస్తి ప్రతి ఎన్నికల నాటికి పెరుగుతూ ఉంది, ఎలా పెరుగుతూ ఉందో చెప్పాలని రవిశంకర్ ప్రసాద్ నిలదీశారు. అదివారం నాడు ఈ రు.9 కోట్ల ప్రశ్న వేశారు.

‘2004 ఎన్నికలపుడు రాహుల్ గాంధీ కేవలం రు. 55,38,123 మాత్రమే. 2009 నాటికి ఇది రు. 2 కోట్లకు పెరిగింది. 2014 నాటికి 9 కోట్లు అయింది. ఇదెలా అయింది,’’ అని ఆయన ప్రశ్నించారు.

‘ఇంత ఆదాయం వచ్చిన మార్గమేమిటి? మనకు వాద్రా మోడల్ తెలుసు. ఇపుడిది రాహుల్ మోడల్ అనుకోవాలా?, రాహుల్ గాంధీకి ఎంపిగా వచ్చే శాలరీ తప్పమరొక ఆదాయం లేదు. రు. 55  లక్షలు 9 కోట్ల రుపాయలయిన గమ్మత్తేమిటో రాహుల్ గాంధీ చె్పాల్సిందే,’ అని న్యాయ శాఖ మంత్రి అడుగుతున్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *