బాధ్యతలు స్వీకరించిన ఆంధ్ర కొత్త గవర్నర్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్​గా బిశ్వభూషణ్ హరిచందన్ చేత హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్ కుమార్ ఇవాళ ప్రమాణస్వీకారం చేయించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఇప్పటికదా ఇఎస్ ఎల్  నరసింహన్ యే రెండు రాష్ట్రాలకు గవర్నర్​గా వ్వవహరించారు.
ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్​కు తొలి గవర్నర్​గా బిశ్వ భూషణ్​ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన మంగళవారమే రాష్ట్రానికి చేరుకున్నారు.
నేటి పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమం కోసం రాజ్ భవన్​ను సర్వాoగ సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా గవర్నర్ ముఖ్యులతో సమావేశమయ్యే మందిరాన్ని కలంకారి చిత్ర రూపాలతో అందంగా అలంకరించారు.
11.15 గంటలకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రాజ్ భవన్​కు చేరుకున్నారు.
11.20కి ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకుని.. గవర్నర్​ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పరిచయం చేశారు.
11.30 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమయింది.
గవర్నర్ ప్రమాణ స్వీకారం దృష్ట్యా రాజ్ భవన్ ప్రాంతంలో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.