సైరా ప్రత్యేక అర్థరాత్రి షోలకు ఎపి అనుమతి

మెగా స్టార్ చిరంజీవి నటించిన  సైరా నరసింహారెడ్డి సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు ఏపీ ప్రభుత్వం అనుమతి. వారం రోజుల పాటు అంటే అక్టోబర్ 8 దాకా ఈ అనుమతి  ఇస్తున్నట్లు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అర్థరాత్రి 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఉంటుంది.
ధియోటర్ల వద్ద రద్దీ నియంత్రణ, బ్లాక్ టికెట్ల నియంత్రణ కోసం ఈ  అనుమతి ఇస్తున్నట్లు హోం శాఖ ఈ రాత్రి విడుదల చేసిన జివో పేర్కొంది.  ప్రత్యేక షోల కోసం అనుమతి నీయాలని  కొణిదల ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన లేఖ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.