ప్రజాసేవకోసం పరిగెత్తుకుంటూ వస్తున్న కోటీశ్వరులు

(పోతిని రమేష్)

ఆంధ్రోళ్లు కూడా అదృష్టం పండుతూ ఉంది…రాష్ట్రంలో ఉండే కోటీశ్వరులంతా రాష్ట్రాన్ని బాగుచేస్తాం, మీ వూరు బాగుచేస్తాం, మీ వీధికి రోడ్డేస్తాం,మీ ఇంటికి నీళ్లిస్తాం, మీ ముసలోళ్లకు పెన్సన్లిస్తాం అని వస్తున్నారు.

అన్ని పార్టీల కోటీ శ్వరులు జనం కోసం ఆరాటపడుతున్నారు.ప్రజలను బాగుచేసేందుకు పోటీ పడుతున్నారు. ప్రజలకు సేవచేసేందుకు, రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతయేందుకు ఉన్న కోటీశ్వరులకు తోడు కొత్త కోటీశ్వరులు కూడా వస్తున్నారు. కోట్లున్నోళ్లంతా ప్రజాసేవ చేసేందుకు ఉరుకుల పరుగుల మీద రోడ్ల మీదకు రావడం ఏయేటికాయేడు పెరుగుతూ ఉంది.

ఈ పోటీ విజయవాడలో ఆసక్తిగా ఉంది.ఎందుకంటే ఇపుడు విజయవాడను బాగుచేసేందుకు ఒక కొత్త కోటీ శ్వరుడు రంగంలోకి వచ్చాడు. ఆయన పేరు పొట్లూరి వరప్రసాద్ (పివిపి). ఆయన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ తరఫున విజయవాడ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్నారు.

ఆయన ఆస్తుల మొత్తం విలువ రూ.347.75కోట్లు అని ఎన్నికల కమిషన్ కు అందించిన ఆఫిడవిట్ లో పేర్కొన్నారు.

ఇందులో చరాస్తులు రూ.236.29కోట్లు కాగా స్థిరాస్తులు రూ.111.46కోట్లు.
ఆయన లోక్ సభనియోజకవర్గంం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్‌ వేశారు.
అపుడు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఆస్తిపాస్తుల అఫిడవిట్‌ సమర్పించారు.

ఆయన కుటుంబానికి ఉన్న అప్పులు రూ.20.95 కోట్లు. . మరో రూ.7.36 కోట్ల వివాదాస్పద బకాయిలు ఉన్నాయి.

పీవీపీ పేరుతో రూ.39.36 కోట్లు, భార్య పేరు మీద 196.60కోట్లు, ఇద్దరు పిల్లల పేరు మీద రూ.32.95లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి.
ఆయనకు రూ.45.95 కోట్లు, భార్యకు రూ.65.51 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. వరప్రసాద్ పేరు మీద అప్పులు రూ.2.91 కోట్లుంటే, భార్యపేరు మీద రూ.18.03 కోట్లున్నాయి.

2017-18లో పన్ను చెల్లించింది .1.49కోట్లు ఆదాయానికే అని చూపారు. తనకు రూ.18.90లక్షల విలువైన 630గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ఇన్నోవా వాహనం ఉన్నట్టు కూడా ఆయ న అఫిడవిట్ లో చూపించారు
ఇక పోటీ గా ఉన్న తెలుగుదేశం అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ (నాని అంటారు) అంత సంపన్నుడు కాదని అఫిడవిట్ల ప్రకారం తెలుస్తుంది.ఆర్థికంగా కోటీ శ్వరుడే అయినా కోట్ల విషయంలో అంత బలవంతుడు కాదనిపిస్తుంది.కేశినేని సిటింగ్ ఎంపి.

ఆయన ఆస్తుల వివరాలు:

కేశినేని శ్రీనివాస్‌ అఫిడవిట్‌ ఆస్తుల మొత్తం విలువ రూ.80.82 కోట్లు. నాని పేరుతో అప్పులు బాగానే ఉన్నాయి. అవి రూ.51.23 కోట్లు. మరో రూ.23.29 కోట్ల వివాదాస్పద బకాయిలు కూడా ఉన్నాయి. చరాస్తులు నాని పేరుతో రూ.10.62కోట్లు, భార్య పేరుతో రూ.1.61కోట్లు, కుమార్తెల పేరు మీద రూ.1.13కోట్లు ఉన్నాయి. . నాని పేరు మీద రూ.66.07కోట్లు, భార్యకు రూ.1.36కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన 2017-18లో ఆయన పెద్దగా ఆదాయం లేదు. పన్ను చెల్లించిన కుటుంబ కేవలం ఆదాయం రూ.26.87లక్షలేనని అపిడవిట్ లో చూపించారు.

ఆయనకు ఐదు వోల్వో బస్సులు, ఆరు మినీ బస్సులు, రెండు బెంజ్‌ కార్లు, ఆడి ఎస్‌యూవీ, బీఎండబ్ల్యూ, ఇన్నోవాలు 4, స్కార్పియో, బొలేరో వాహనాలు ఉన్నాయి.

సుమారు రూ.3.41 కోట్ల విలువైన 3.85కిలోల బంగారం ఉంది. రూ.10లక్షల విలువైన 25కిలోల వెండి వస్తువులున్నాయని ఆఫిడవిట్ లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *