కర్నూల్ డిఐజికి ఝలక్ ఇచ్చిన వైసీపీ నేత గోరంట్ల మాధవ్

హిందూపూర్ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కర్నూల్ డిఐజికి ఝలక్ ఇచ్చారు. శుక్రవారం ఆయన ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. విధులనుంచి రిలీవ్ చేయమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేయకుండా కర్నూల్ డీఐజీ నాగేంద్ర కుమార్ ఉద్దేశ పూర్వకంగా తప్పించుకుని తిరుగుతున్నారు అని ద్వివేదీకి ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిఐజి పైన, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుపైన సంచలన ఆరోపణలు చేశారు. ఆయన ఏం మాట్లాడారో కింద ఉంది చూడండి.

విధులనుంచి రిలీవ్ చేయమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అమలు చేయకుండా కర్నూల్ డీఐజీ ఉద్దేశ పూర్వకంగా తప్పించుకుని తిరుగుతున్నారు. రిలీవ్ చేయాల్సిన అధికారి తప్పించుకు తిరగడం సిగ్గు చేటు అని మండిపడ్డారు మాధవ్.

ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపును సునాయాసం చేసేందుకే నన్ను రిలీవ్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు అని ఆరోపించారు. పోలీస్ అధికారులే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేయటం సిగ్గుచేటు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు డైరెక్షన్ లో డిఐజి పని చేస్తున్నారు అని విమర్శించారు.

ఐపీఎస్ అధికారులు పార్టీల కోసం పని చేయకూడదు అని హితవు పలికారు. ఇంటలిజెన్స్ డిజి., కర్నూల్ డీఐజీ ల తీరును ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాను. పోలీస్ అధికారుల దురుద్దేశాలను ఎన్నికల సంఘంకి వివరించాను అని తెలిపారు వైసీపీ నేత గోరంట్ల మాధవ్.

ఇది కూడా చూడండి…

https://trendingtelugunews.com/ka-paul-different-action-video/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *