ఆటోమొబైల్ రంగంలో సంక్షోభ సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో పేరుమోసిన అటోమొబైల్ కంపెనీల మీద ఇది ప్రభావం చూపిస్తూ ఉంది.డిమాండ్ పడిపోవడంతో ఈ కంపెనీలు ఉత్పత్తితగ్గిస్తున్నాయి. కొత్త మోడెల్స్ మార్కెట్ లోకి విడుదల చేసినా సెల్క్ పెరగడంలేదు. 2008-09 లో పతాకాస్థాయిలో జరిగిన బిజినెస్ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతూ ఉంది.
ఉత్పత్తి తగ్గడం అంటే ఉద్యోగాలు పోవడం. మొదట ఉపాధి పోయేది కాంట్రాక్టు వర్కర్లకు . అదే జరుగుతూ ఉంది.ఒక్క జూలై నెలలో 2.3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) విడుదలచేసిన వివరాలు చెబుతున్నాయి.
జూలై నెలలో అటోమొబైల్ డొమెస్టిక్ సేల్స్ 50 శాతం పడిపోయాయని ఈ కంపెనీలు ప్రకటించాయి. మార్కెట్ లీడర్ గా పేరున్న మారుతి సుజుకి సేల్స్ 36.2 శాతం పడిపోయాయి.
ఇది ఇలా అకస్మికంగా వచ్చింది కాదు.గత పదమూడునెలలుగా సాగుతూ వచ్చి జూలై నెలలో తారా స్థాయికి చేరుకుంది. అందుకే ఈకంపెనీలన్నీ ప్రొడక్షన్ తగ్గిస్తున్నాయి. బిజినెస్ మందగిస్తుందని, ఉద్యోగాలు పోతాయనే ఆందోళన మొదలయింది.
ప్రొడక్షన్ తగ్గించేందుకు ఆగస్టు నెలలో నాలుగు రోజులు కంపెనీ మూసేయాలని దేశంలో నెంబర్ వన్ టూవీలర్ తయారీ దారు హీరో మోటో కార్ప్ ప్రకటించింది.
ఆటో విడిభాగాలు తయారుచేసే టివిఎస్ గ్రూప్ కు చెందిన కంపెనీ సుందరం క్లేటాన్ తమిళనాడు పాడిలో ఉన్న యూనిట్ కు రెండు రోజులు సెలవు ప్రకటించాలని నిర్ణయించింది.
3000 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించినట్లు దేశంలో నెంబర్ వన్ కార్ల ఉత్పత్తి దారు మారుతి సుజుకి ధృవీకరించింది. బిజినెస్ మందగించడంతో ఈ ఉద్యోగుల కాంట్రాక్టులను రెనివల్ చేయలేదని తెలిసింది.
ఆటోమొబైల్ రంగంలో ప్యాసింబర్ వాహనాల అమ్మకాలు 19 సంవత్సరాల నాటికి స్థాయికి పడిపోయాయని ఈ ఆటోమొబైల్ రంగం ప్రకటిచింది.అన్ని కంపెనీలు కలసి జూలై 2019లో 1,825,148 వాహానాలను మాత్రమే అమ్మగలిగాయి.
ఆగస్టు 15నుంచి 18వరకు తమ కంపెనీనీ స్వాతంత్య్ర దినోత్సవం, రక్షాబంధన్, వారాంతం కోసం సెలవులు ప్రకటించి మూసేస్తున్నామని హీరో మోటాకార్ప్ స్టాక్ ఎక్చేంజ్ కి తెలిపింది.
ఒక మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఇలా నాలుగు రోజులు సెలవులు ప్రకటించడం అసాధారణం. జూలై నెలలో ఈ కంపెనీ సేల్స్ 22.9 శాతం పడిపోయాయి.
ఇదే విధంగా ఆగస్టు 16 ,17 తేదీలను పాడి ఫ్యాక్టరీ నాన్ వర్కింగ్ హాలిడేస్ గా సుందరం క్లేటాన్స్ ప్రకటించింది.
మార్కెట్ లోతగ్గిన డిమాండ్ కు తగ్గట్టుగా ప్రొడక్షన్ మార్చుకుంటున్నట్లు టాటా మోటార్స్ , మహింద్ర & మహింద్ర ప్రకటించాయి.
ఇక టాటా మోటార్స్ దగ్గిర పరిస్థితి ఎలా ఉందో ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒక కథనం ప్రచురించింది. జంషేడ్ పూర్ చుట్టు పక్కల ఉన్న చిన్నచిన్నఆటోమొబైల్ విడిభాగాల యూనిట్లలో వందలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీళ్లంతా రోజూ కూలిలయిపోయారు.
వీరంతా జంషేడ్ పూర్ ఇమ్లిచౌక్ వద్ద కు వచ్చి కాంట్రాక్టర్లెవరైనా తమ కూలిపని ఇస్తారేమోనని వేచిచూస్తున్నారు.
మామూలుగా రోజూ ఒక రెండొందల మంది ఇక్కడ ఇలా కూలికోసం గుమికూడే వారు. కాని, ఇపుడు వీళ్ల సంఖ్య విపరీతమయిపోయిందని ఈ పత్రిక రాసింది.
కారణం, చట్టుపక్కల ఉన్న అటోమొబైల్ అనుబంధ సంస్థల ఉత్పత్తులకు గిరాకి పడిపోయి ఉద్యోగాలు పోవడమేనని ఈపత్రిక వ్యాఖ్యానించింది.