ఏకంగా గ్రీన్ ల్యాండ్ నే కొనాలనుకున్న ట్రంప్, అసలు రహస్యం ఇదే…

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆలోచనలు చిత్రంగా ఉంటాయి. దేశాలను గుప్పిట్లో పెట్టుకోవడం అమెరికాకు తొలినుంచి అలవాటు. వ్యాపారం ద్వారానో, సైన్యాలను పంపో ఏదో విధంగా అమెరికా ప్రపంచ దేశాలను తనవైపు తిప్పుకుంటూ ఉంటుంది.
ఇపుడు మరొక కొత్త విధానంలోకి మారుతూ ఉంది. అది ఏకంగా భూభాగాలను కొనేయడం. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం. ప్రపంచంలో అతిపెద్ద దీవి అయిన గ్రీన్ ల్యాండ్ ను ట్రంప్ కొనాలనుకుంటున్నాడు. అపుడు అమెరికా అర్కిటిక్ దాకా, ఐరాపా దాకా విస్తరిస్తుంది. రాజకీయాల్లోకి రాకముందు ట్రంప్ ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇపుడు కూడా వ్యాపారం దోరణి మార్చుకోలేదు.
ఈ విషయాన్ని మొదట  ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ఆగస్టు 15 వెల్లడించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/crisis-grips-automobile-sector-in-india-as-the-demand-falls-steeply-hero-motocrop-sundaram-claytons-maruti-suzuki/

అర్టికిల్ 370 రద్దు కావడానికి ముందటి కాశ్మీర్ లాగా  గ్రీన్ లాండ్ డెన్మార్క్ దేశానికి చెందిన అటానమస్ రీజియన్. అక్కడ స్వతంత్ర ప్రభుత్వం ఉంటుంది. డెన్మార్క్ తన బడ్జెట్ లో నుంచి ప్రతియేటా కొంతమొత్తాన్ని గ్రీన్ ల్యాండ్ కు అందిస్తుంది.
గ్రీన్ ల్యాండ్ ఒక మంచు ప్రపంచం. అయినా సరే ట్రంప్ కన్నుబడింది. దీనికి కారణం.2,166,086 చ.కి.మీ విస్తీర్ణం ఉన్న గ్రీన్ ల్యాండ్ ఎలాంటి పొల్యూషన్ కు ఇంకా గురికాని ప్రదేశం. 80 శాతం భూభాగం మంచుతో కప్పబడి ఉంటుంది. సమృద్ధిగా అక్కడ స్వచ్ఛమయిన నీరు,చేపలు దొరకుతాయి.
అంతేకాదు, విస్తారంగా ఖనిజ సంపద ఉంది.బ్రూకింగ్స్ ఇన్ స్టిట్యూట్ నివేదిక ప్రకారం గ్రీన్ ల్యాండ్ లో ఐరన్, లెడ్, జింక్, డైమండ్స్, గోల్డ్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, యురేనియం లతో పాటు ఆయిల్ కూడా ఉంది. గ్రీన్ ల్యాండ్ జనాభా 57 వేల మంది (2018) మాత్రమే.
అయితే, ట్రంప్ కొనాలనుకుంటున్నా గ్రీన్ ల్యాండ్ గాని, డెన్మార్క్ గాని అమ్మకానికి సిద్ధంగా లేవు. మేం బిజినెస్ కు సిద్ధమేకాని,  ఏకంగా అమ్మకానికి వ్యతిరేకం అని గ్రీన్ ల్యాండ్ విదేశీ వ్యవహారాల శాఖ చాలా స్పష్టమయిన ప్రకటన చేసింది.

 

#Greenland is rich in valuable resources such as minerals, the purest water and ice, fish stocks, seafood, renewable energy and is a new frontier for adventure tourism. We’re open for business, not for sale❄️🗻🐳🦐🇬🇱 learn more about Greenland on: https://t.co/WulOi3beIC

— Greenland MFA 🇬🇱 (@GreenlandMFA) August 16, 2019


భూమ్మీదఅసంభవాలేమయినా ఉంటే వాటిలో గ్రీన్ ల్యాండ్ అమ్మకం ఒకటని డానిష్ పార్లమెంటు సభ్యడుడు రాస్మస్ జర్లోవ్ కూడా ప్రకటించారు.

 

Out of all things that are not going to happen this is the most unlikely. Forget it. https://t.co/0ChJvOVJW7

— Rasmus Jarlov (@RasmusJarlov) August 15, 2019

గ్రీన్ లాండ్ మీద అమెరికా కన్నేయడం ఇది మొదటి సారి కాదు. గ్రీన్ ల్యాండ్ అంతర్జాతీయంగా రాజకీయ పరంగా చాలా వ్యూహాత్మకం ప్రదేశం. అర్కిటిక్ మహాసముద్రానికి దిగువన కెనడా యూరోప్ ల మధ్య ఉంటుంది. 1829-37 మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్న యాండ్రూ జాక్సన్ గ్రీన్ ల్యాండ్ కొంటే ఎలా ఉంటుందని యోచించారు. 1867లో అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటు ఈ మేరకు నివేదిక కూడా తయారుచేసింది. తర్వాత ప్రెశిడెంట్ హ్యారీ ట్రూమన్ 1946లో 100 మిలియన్ డాలర్ల ధర పెట్టి డెన్మార్క్ నుంచి కొనాలని చూశారు. ఇవేవీ సక్సెస్ కాలేదు. ఇపుడు అంతర్జాతీయంగా అమెరికా పొజిషన్ బలపడాల్సి ఉంది. అందువల్ల ట్రంపు మరొక బాణం వేశారు. గ్రీన్ ల్యాండ్ ను కొనాలనుకుంటున్నట్లు చెప్పారు.
డెన్మార్క్ అమెరికా మిత్రదేశం. అందువల్ల డెన్మార్క్ లో స్వతంత్ర ప్రతిపత్తి ప్రాంతంగా ఉన్నందున, గ్రీన్ ల్యాండ్ ను కొనాలంటే డెన్మార్క్ ఆమోదం తప్పనిసరి. అయిత, మిత్రదేశమయినందున డెన్మార్క్ ను ఒప్పించవచ్చని ట్రంప్ ఆలోచన,  రియల్ ఎస్టేట్ ‘డీల్ అఫ్ ది సెంచురీ’ ( Deal of the century) గా ప్రపంచ మంతా ఈ వార్త రగిలిపోవడంతో ట్రంప్ స్వయంగా వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది.

 

Regarding a report that he wants to purchase Greenland from Denmark, Trump said “It’s not number one on the burner,” but that he’s “looking at it” pic.twitter.com/HTesupmcRy

— Bloomberg TicToc (@tictoc) August 18, 2019


అయితే, నెంబర్ వన్ బర్నింగ్ ఇష్యూ కాదని వ్యాఖ్యానించారు. అయితే దీని మీద తాము మాట్లాడుతకున్నట్లు ఆయన అంగీకరించారు. అయితే, గ్రీన్ ల్యాండ్ వైపు చూస్తున్నట్లు మాత్రం అంగీకరించారు. డెన్మార్క్ తో కొద్దిగా మాట్లాడతామని కూడా చెప్పారు.
‘ఇది ఒక భారీ రియల్ ఎస్టేట్ డీల్. డెన్మార్క్ కు ఆసక్తి ఉంటే గ్రీన్ ల్యాండ్ ని కొనొచ్చు.ఎందుకంటే,ఏటా 700 మిలియన్ డాలర్లను గ్రీన్ ల్యాండ్ కు ఇవ్వలేక డెన్మార్ తనకలాడుతూ ఉంది, ఇది ఎంత బాధో,’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.