జనవరి 17న తెలంగాణ అసెంబ్లీ సమావేశం, అహ్మద్ ఖాన్ ప్రోటెం స్పీకర్

పవిత్ర ఉత్తరాయణ పుణ్యకాలంలో, ఏకాదశి శుభ తిదినాడు, బుధవారం జనవరి 17, 2019 న తెలంగాణ నూతనశాసన సభతొలి సమావేశం ప్రారంభమవుతుంది.  తొలి శాసనసభ సమావేశాల పూర్వరంగంలో, ఆ క్రితం రోజు, దశమి తిధి, జనవరి 16, 2019 న సాయంత్రం 5 గంటలకు, కొత్తగా ఎన్నికైన శాసనసభ సభ్యుల్లో సీనియర్ అయిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ రాజ భవన్ లో ప్రోటెం స్పీకర్ గా బాధ్యత స్వీకరిస్తారు.

గవర్న్జర్ ఇఎస్ఎల్ నరసింహన్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ తో ప్రమాణం చేయిస్తారు. ఆ  మరుసటి రోజు నుండి నూతన శాసనసభ కార్యకాలపాలు ప్రారంభమవుతాయి.

ప్రజలు గొప్ప మెజారిటీతో తమను గెలిపించారని, ఆ స్పూర్తితో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశి తిథినాడు శాసనసభ కార్యకలాపాలు ఆరంభించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు.

శాసనసభ కార్యకలాపాలు 17 జనవరి నుండి 20 జనవరి వరకు వుంటాయి.
జనవరి 17, 2019 న అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11-30 గంటలకు ప్రోటెం స్పీకర్ అధ్యక్షతన ప్రారంభమవుతాయి. నూతనంగా ఎన్నికైన శాసనసభ సభ్యులు ఆ తరువాత ఒకరివెంట ఒకరు శపథస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమం సుమారు రెండుగంటలు కొనసాగుతుంది. ఆ మధ్యాహ్నం జూబిలీహాల్ ప్రాంగణంలోని కౌన్సిల్ లాన్స్ లో శాసనసభ సభ్యులకు లంచ్ ఏర్పాటు చేస్తారు. అదే రోజున స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ కార్యక్రమాలు వుంటాయి.

మర్నాడు జనవరి 18, 2019 న స్పీకర్ ఎన్నిక, ఎన్నికైనట్లు ప్రకటన వుంటాయి. ఆ తరువాత నూతనం ఎన్నికైన స్పీకర్ ను, సభానాయకుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రతిపక్ష నాయకులు, ఇతర రాజకీయ శాసనసభా పక్ష నాయకులు స్పీకర్ స్థానానికి తోడ్కొని పోతారు. అ తరువాత నూతనంగా ఎన్నికైన స్పీకర్ అధ్యక్షతన సభా కార్యక్రమాలు సాగుతాయి. ఆ తరువాత స్పీకర్ బీఎసీ సమావేశాన్ని నిర్వహిస్తారు. మర్నాటి గవర్నర్ ప్రసంగం విషయంలో బీఎసీ నిర్ణయం తీసుకుంటుంది.

జనవరి 19, 2019 న శాసనసభనుద్దేశించి గవర్నర్ ప్రసంగం వుంటుంది. ఆ మర్నాడు జనవరి 20, 2019 న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలపడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *