నిర్మల ధ్యానంతో కొత్త సంవత్సరం జరుపుకునే ఒకే ఒక్క దేశం

ఎయిర్ పోర్ట్ మూసేశారు. విమానాల రాకపోకలు ఆపేశారు. ఇంటర్నెట్ బంద్ చేశారు. మొబైల్ కంపెనీలన్నీ సర్వీసులు బంద్ చేశాయి. రోడ్ల మీదకు ఎవ్వరు రాకూడదు. రోడ్ల మీదకు ఎవరూరాకుండా ఉండేందుకు పోలీసుల కాపలా. టివి రేడియో ప్రసారాలు అన్నీ బంద్.  దేశమంతటా నిర్మానుష్యం.అంతటా నిశబ్దం.

ఇదేదో కర్ఫ్యూ విధించిన ప్రాంతంలో పరిస్థితిలాగా ఉంది కదూ.

అవును పరిస్థితి కర్ఫ్యూ లాగే ఉంది గాని, విషయం అదికాదు. ఇది ఇండోనేషియలోని బాలి ద్వీపంలో కొత్త సంవత్సరం జరుపుకునే పద్ధతి.

అక్కడ ఈ రోజు 40 లక్షల మంది ప్రజలు ఇంటర్నెట్ చూడరు, ఫోన్లలో మాట్లాడరు. బయటకురారు, కిటీలు కూడా మూసేస్తారు. లైట్లు ఆర్పేస్తారు. క్యాండిల్ కూడా వెలిగించడానికి వీల్లేదు. ప్రశాంతంగా, నిశబ్దంగా, నిర్మలంగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఒక రోజు ధ్యానంలో గడపుతారు. అది అక్కడి పవిత్ర హిందూ సంప్రదాయం.

ప్రతి కొత్త సంవత్సరం (శకం) తొలి రోజు బాలిద్వీపం ఇలా మౌన ముద్రలోకి జారుకుంటుంది. మౌనం తర్వాత వాళ్లు కొత్త సంవత్సరంలోకి జారుకుంటారు.

ఈరోజు అంటే మార్చి ఏడవ తేదీన ఈ వార్త రాస్తున్నపుడు బాలి మౌన ముద్రలో ఉంది. దీనిని అక్కడ కొత్త సంవత్సరాన్ని న్యేపి అంటారు. గురువారం ఉదయం ఆరుగంటలకు మౌనం  మొదలయింది. సాయంకాలం ఆరు దాకా ఇది కొనసాగుతుంది.

టూరిజమే పెద్ద వ్యాపారమయినా బాలి బీచ్ లలో ఎవరు కనిపించకుండా చూస్తారు. ఇలాగే ద్వీపంలోని బహిరంగ ప్రదేశాలలో కూడా జనసంచారం లేకుండా కట్టుదిట్టం చేస్తారు. న్యేపీ రోజు పర్యటకులు కూడా హోటల్ గదులకు పరిమితం కావలిందే.

మనం న్యూఇయర్ డే గోల గోలగా జరుపుకుంటున్నాం. దీనికి పూర్తిగా వాళ్లు నమ్మే సంప్రదయా బద్దంగా దేశమంతా పొల్లు పోకుండా ఒక రీతిలో కొత్త సంవత్సరం ప్రశాంతంగా జరుపుకోవడం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇంగ్లీష్ న్యూఇయర్ వాసన లేని ప్రాంతంలో ప్రపచంలో  బాలి ద్వీపమేనేమో.

ఇండోనేషియా ముస్లిం దేశం. అయినా ఈ హిందూ సంప్రదాయాన్ని(ఉగాది) ఎంతగా గౌరవిస్తారంటే, ఆ రోజు  వాళ్ల కోసం ఆ దేశ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుంది. ఆ రోజును హిందువుల మనోభావాల ప్రకారం జరపుకునేందుకు సహకరిస్తుంది. అందుకే న్యేపి ప్రపంచలోనే విశేషమయిన యుగాది. బాలి క్యాలెండర్ గ్రెగొరియన్ క్యాలెండర్ కు 78 సం. వెనక ఉంటుంది. ఇది ఈ యేగాది 1941 అవుతుంది.


‘ఈ ఒక రోజు నిశబ్దంతో బాలితో కొత్త శకం (సంవత్సరం) మొదలవుతుంది. జీవితాన్ని పరిశుద్ధ హృదయంతో పున: ప్రారంభించేందుకు ఇదొక అవకాశం,’ బాలి ద్వీపంలో టూరిస్టు కేంద్రమయిన కూటా లోని ఒకహోటల్ మేనేజర్ వాయన్ గోతా అన్నారు.

ఇలా నిశబ్దంగా,ప్రశాంతంగా ధ్యానంలో గత ఏడాది నేనేం చేశానో చూసుకుని, వచ్చే ఏడాది ఏం చేయాలో నిర్ణయించుకోవడం ఈ రోజు చేసే పని ఆయ చెప్పారు.

ఈ సంప్రదాయన్ని ఉల్లంఘించి బయటకు వచ్చే వారి మీద పోలీసుల చర్యలు తీసుకుంటారు.గతంలో న్యేపీ రోజు బయటకు తిరిగేందుకు ప్రయత్నించిన పర్యాటకు పోలీసులు అరెస్టు చేశారు.


బాలి న్యూఇయర్ అనేది అరు రోజుల ప్రశాంత పర్వం. ఈ సమాయన్ని పూర్తిగా జీవితం గురించి ఆలోచించేందుకే కేటాయిస్తారు. ఈ వరసలో మూడో రోజున న్యూపీ జరుగుతుంది. న్యేపీ అంటే నిశబ్దంగా ఉండటం. ఇది అమావాస్య రోజున జరుగుతుంది. న్యేపీ జాతీయ పర్వదినం కాబట్టి రాజధాని దెన్ పసర్ విమానాశ్రయాన్ని పూర్తిగా మూసేయడం జరగుతుంది. ఇది చాలా గొప్ప విషయం. ఒక పండగ కోసం విమానాశ్రయాలను, ఇంటర్నెట్ లను, మొబైల్ సర్వీసులను బంద్ చేయడం అనేది ఎక్కడ ఎపుడూ వినిఉండం.

న్యేపీ ముందురోజు మాత్రం విపరీతమయిన పండగ సందడి ఉంటుంది. అట్ట హాసంగా ఒగో ఒగో భూత ప్రేత పిశాచాల బొమ్మలతో వూరేగింపులు నిర్వహిస్తారు. ఇండోనేషియాలో న్యేపీ జనరల్ పబ్లిక్ హాలిడే అయితే, బాలి ద్వీపంలో మాత్రం హిందూ పవిత్ర ప్రత్యేక శెలవు దినం. ఈ న్యేపీ బంద్ కచ్చితంగా అమలయ్యే లా చూసేందుకు పెకలాంగ్ అనే న్యేపీ పోలీసులుంటారు.


బాలి లోని హిందూవులు కొత్త సంవత్సరం రోజు చతుర్వ్రత పెనెపియన్ (Catur Brata Penyepian) అంటే నాలుగు నిషేధాలు పాటిస్తారు. ఇవి అమతి గెని ( అగ్ని నిషేధం),అమతి లెలుంగన్ (ప్రయాణ నిషేధం),అమతి కార్య (కార్యక్రమాల నిషేధం), అమతి లేలాంగువన్ ( వినోదాల నిషేధం). 354 దినాల తర్వాత ఒక్క రోజు ప్రకృతి మాతను ప్రశాంతంగా ఉంచడం, మరుసటి సంవత్సరం పునరుజ్జీవం కోసం ఇవన్నీ పాటిస్తారు. ఈరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఈ నియమాలు అంతా పాటించాల్సిందే. ఎవరీకి మినహాయింపు లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *