భూమికి 320 కి.మీ ఎత్తున ఒక పెను ప్రమాదం తృటిలో తప్పింది.
రోదసిలో ఎగురుతున్న రెండు ఉపగ్రహాలు తమ అర్బిట్లను క్రాస్ చేయబోయి ఢి కొనే ప్రమాదం ఏర్పడింది.అయితే పట్టింపులకు పోకుండా యూరోపియన్ స్పేస్ ఎజన్సీ తన ఉపగ్రహాన్ని పక్కకు మళ్లించడంతో స్పెస్ ఎక్స్ సంస్థ ఉపగ్రహంతో ఢీ కొనే ఉపద్రవం తప్పి పోయిందని ఫోర్బ్స్ వెల్లడించింది.
సెప్టెంబర్ రెండో తేదీన సోమవారం నాడు ఈ ప్రమాద పరిస్థితి ఏర్పడింది. యూరోపియన్ స్పేస్ ఏజన్సీకి చెందిన ఎయియోలస్ ఉపగ్రహానికి, ఇలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ 44 ఉప్రగహం ఢీ కోనే పరిస్థితి ఆరోజు ఏర్పడింది.
తన ఉప గ్రహం తిరుగున్న కక్ష నుంచి పక్కకు జరగాలని యూరోపియన్ స్పేస్ ఏజన్సీ చేసిన విజ్ఞప్తిని స్పేస్ ఎక్స్ ఖాతరు చేయలేదు. దీనితో తన ఉపగ్రహాన్నేధ్రస్టర్స్ ఉపయోగించి పక్కను మళ్లించాల్సి వచ్చిందని యూరోపియన్ స్పేస్ ఏజన్సీ వెల్లడించింది.
యూరోపియన్ స్పేస్ ఏజన్సీ ఎయియోలస్ ఉపగ్రహం స్టార్ లింక్ 44 కంటే తొమ్మిది నెలలు ముందుగానే రోదసిలో ఒక కక్షలో తిరుగుతూ ఉంది. తర్వాతే స్పేస్ ఎక్స్ ఉపగ్రహం రోదసిలోకి ప్రవేశించింది. ఈ రెండు ఢీ కొనే పరిస్థితి ఉందని అమెరికా మిలిటరీ హెచ్చరిక చేసినా స్పేస్ ఎక్స్ పట్టించుకోలేదు. అమెరికా మిలిటరీ స్పేస్ ట్రాఫిక్ ను మానిటర్ చేస్తూ ఉంటుంది.
స్పేస్ ఎక్స్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో ప్రమాదం జరిగే పరిస్థితి వేయింట ఒకటి చేరుకోవడంతో తాము ఎయియోలస్ ను పక్కకు మళ్లించామని యూరోపియన్ స్పేస్ ఏజన్సీ తెలిపింది.
ఎయియోలసన్ ను 2018 ఆగస్టులో ప్రయోగిస్తే, స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ శటిలైట్ ను ఈ ఏడాది మే 23న ప్రయోగించింది. అయితే, స్టార్ లింక్ 44 ఉపగ్రహం ఎయియోలస్ ఆర్టిట్ లోకి ప్రవేశించడంతో ప్రమాదం జరిగే పరిస్థితి తలెత్తింది.
అయితే, ఆకాశం ఎవరి సొత్తు కాదు, ఎవరి రూల్స్ అక్కడ పనిచేయవు, ఎవరిష్టం వారిది. ఉప గ్రహాలు ఢీ కొనే పరిస్థితి వచ్చినపుడు ఎవరో ఒకరు పక్కకు జరగాల్సిందే తప్ప మరొక మార్గం లేదు.
స్పేష్ ఎక్స్ ఎందుకు యూరోపియన్ స్పేస్ ఏజన్సీ విజ్ఞప్తిని ఖాతరు చేయలేదో కారణాలు తెలియవు.
అంతరిక్షంలో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. సాధారణంగా అక్కడ తిరిగి చెత్తచెదారం తో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
2018 ఇలాంటి ఇలాంటి వాటితో జరిగే ప్రమాదాలను 28 సార్లు తప్పించినట్లు యూరోపియన్ స్పేస్ ఏజన్సీ తెలిపింది. అయితే, ఒక యాక్టివ్ శటిలైట్ తో జరిగే ప్రమాదాన్ని తప్పించుకోవడం ఇదో మొదటిసారి అని ఈ సంస్థ పేర్కొంది.
ఇలాంటి ప్రమాదాలు చాలా అరుదు. అయితే, స్టార్ లింక్ వాటి వల్ల అంతరిక్ష ప్రమాదలు జరిగే అవకాశాలు పెరిగాయని ఈ సంస్థ ఆందోళనవ్యక్తం చేస్తున్నది.
ఆకాశంలో ఉపగ్రహాలు ఢీ కొనడం అనేది ఎపుడూ జరగలేదు. 2009 లో ఒకసారి అమెరికా ఉపగ్రహం ఇరిడియమ్ 33 కాస్మోస్ -2251 అనే ఒక పనిచేయని ఉపగ్రహంతో ఢీ కొనింది. దీని ఫలితంగా ఉపగ్రహం వేయి ముక్కలయింది. కాస్మోస్ అనేది రష్యావాళ్లు తయారు చేసిన ఉపగ్రహం. ఇది చెడిపోయి స్పేస్ లో తిరుగుతూ ఉండింది.