టిటిడి అధికారులు భేషరతుగా క్షమాపణలు చెప్పాలి: యాక్టివిస్ట్ నవీన్
(నవీన్ కుమార్ రెడ్డి)
తిరుపతి శాసనసభ్యులను సంప్రదించకుండా నగర ప్రజలకు సంబంధించిన విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని నగర ప్రజలను మానసికంగా మనోవేదనకు గురిచేసిన టీటీడీ ఎస్టేట్ అధికారిపై శాఖపరమైన చర్యలు తీసుకోకపోతే నగర ప్రజలలో ఆందోళన అలాగే కొనసాగుతూనే ఉంటుంది!
తిరుపతిలో 22 ఏ అన్ని వర్గాల ప్రజలను గందరగోళంలోకి నెట్టేసింది ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మధ్యతరగతి కుటుంబాలు అప్పు సప్పు చేసి కొన్న ప్లాట్లు అపార్ట్మెంట్లు 22A కింద ఉన్నాయన్న అభద్రతాభావంతో మానసికంగా కృంగిపోయారు తమ సర్వే నెంబర్లు 22 A లో ఉన్నాయా అన్న అనుమానంతో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి పరుగులు తీశారు!
టీటీడీ ప్రాపర్టీ సెల్ అధికారి ఎస్టేట్ ఆఫీసర్ నిర్లక్ష్యం కారణంగా దేవాదాయ శాఖకు పంపిన “సర్వే నెంబర్లు డబల్ టైం రిపీట్” అయ్యాయని దాని కారణంగా ప్రైవేటు ప్రాపర్టీలు కూడా 22 ఏలోకి వచ్చాయని సవరణలు చేసి పంపుతామని “చావు కబురు చల్లగా చెప్పినట్లు” సాక్షాత్తు టిటిడి ఉన్నతాధికారులే దేవాదాయ శాఖకు లేఖ రాయడం దేవాదాయ శాఖ అధికారులు తప్పులు సరిదిద్ది పంపే వరకు రిజిస్ట్రేషన్ లను “అభయన్స్” లో (ఉన్నది ఉన్నట్లుగా) పెట్టండి అని చెప్పడం టిటిడి లోని కొంతమంది అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట!
తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారితో ముందస్తుగా చర్చించకుండా సంప్రదించకుండా 22A కింద రిజిస్ట్రేషన్ల నిలుపుదలపై టిటిడి ఎస్టేట్ ఆఫీసర్ ప్రైవేటు భూముల సర్వే నెంబర్లను దేవాదాయ శాఖకు పంపించి రిజిస్ట్రేషన్లు నిలిపించి గందరగోళం సృష్టించి తిరుపతి నగర ప్రజలలో అభద్రతా భావాన్ని తీసుకొచ్చారు అలాంటి అధికారుల మీద శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని నగర ప్రజల తరఫున ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడి నడుస్తుంది,రాష్ట్ర ప్రభుత్వానికి భూముల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ ల ద్వారా అత్యధికంగా ఆదాయం వస్తుంది అన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించి తొందరపాటు నిర్ణయాలతో ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్న టీటీడీ ఎస్టేట్ అధికారులను సాగనంపాలన్నారు!
తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో దాతలు ఇచ్చిన భూములను సైతం టీటీడీ ఎస్టేట్ అధికారులు అవగాహన రాహిత్యంతో 22A తరహాలో డబల్ ఎంట్రీలతో సంరక్షిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి!
తిరుపతి నగర ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసినందుకు సంబంధిత టిటిడి అధికారులు నగర ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని,మానసిక ఒత్తిడికి గురి చేసినందుకు నష్టపరిహారం చెల్లించాలని అవగాహన రాహిత్యంతో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పంపిన సర్వే నెంబర్లను 22A నుంచి వెంటనే మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను!
(నవీన్ కుమార్ రెడ్డి, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్,
ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు)