శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనం, విజ్ఞాన వ్యాప్తికి కేంద్రాలుగా విలసిల్లాల్సిన విశ్వవిద్యాలయాల్లో “హోమం” లాంటి మూడనమ్మకాలను ప్రోత్సహించడం అశాస్త్రీయ.
ఇలాంటి అశాస్త్రీయ కార్యక్రమాలను నిర్వహించడానికి, విరాళాల సేకరణకు అనంతపురం లోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (SK University) పూనుకుంది.
దీనికోసం వైస్ – ఛాన్సలర్ ప్రోత్సాహంతో రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేయడం అత్యంత గర్హనీయమైన చర్య.
ఇలాంటి ఛాందస భావాలున్న వారు, పాలకుల అడుగులకు మడుగులొత్తే వారు విశ్వవిద్యాలయాల వైస్ – ఛాన్సలర్స్, రిజిస్ట్రార్స్ !
-టి లక్ష్మీ నారాయణ, సామాజిక ఉద్యమకారుడు