తాండూరు కందికి భౌగోళిక గుర్తింపు

 

 

* నాణ్యతాపరంగా తాండూరు కందికి విశిష్ట లక్షణాలు

* రుచి, సువాసన మరియు పోషకాలలో దేశవ్యాప్తంగా డిమాండ్

తాండూరు నేలల స్వభావం, నేలలలోని పోషకాలు, అనుకూల వాతావరణ పరిస్థితులు, రైతులు ఆచరించే సాంప్రదాయ మరియు ఆధునిక యాజమాన్య పద్దతుల మూలంగా ప్రత్యేక గుర్తింపు లభించింది.

వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాలలోని లక్ష 48 వేల ఎకరాలలో కంది సాగుఉంది.

ఇప్పటి వరకు దేశమంతటా భౌగోళిక గుర్తింపు కోసం వివిధ రంగాల నుండి వెయ్యి ధరఖాస్తులువచ్చాయి.

432 ఉత్పత్తులకు మాత్రమే భౌగోళిక గుర్తింపులభించింది.

ఆజాది కా అమృత్ ఉత్సవాలలో 75 ఉత్పత్తులు జిఐ జర్నల్ లో ప్రచు రించారు.

ఈ ఏడాది వచ్చిన ధరఖాస్తులలో కేవలం 9 ఉత్పత్తులకు గుర్తింపు .. అందులో తాండూరు కంది ఒకటి కావడం గమనార్హం

మొత్తం ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతానికి 16 ఉత్పత్తులకు గుర్తింపు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరు ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు .. పుట్టపాక తేలియ రుమాలు (2015), బంగినపల్లి మామిడి (2017), ఆదిలాబాద్ ఢోక్రా, వరంగల్ డురీస్(2018), నిర్మల్ పెయింటింగ్ (2019), తాండూరు కంది (2022) గుర్తింపు పొందిన వాటిలో ఉన్నాయి

అందులో మామిడి, కంది ఉద్యాన, వ్యవసాయ రంగ ఉత్పత్తులు కావడం విశేషం

వండిన పప్పు ఎక్కువకాలం నిల్వ ఉండడం, తొందరగా ఉడకడం, మంచి రుచి, వాసన తాండూరు కంది ప్రత్యేకత

తాండూరు ప్రాంతంలో ఉన్న సున్నపురాయి నిక్షేపాల వల్ల వచ్చే పోషక నాణ్యతలే దీనికి కారణం

దేశంలోని ఢిల్లీ, ముంబయి, కోల్ కతాలలో తాండూరు కంది బ్రాండ్ కు డిమాండ్

భౌగోళిక గుర్తింపు కోసం ధరఖాస్తు చేసుకున్న యాలాల రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం మరియు తాండూరు కంది పరిశోధనా స్థానం

భౌగోళిక గుర్తింపు సాధించిన నేపథ్యంలో ఆ ప్రాంత రైతులు, వ్యవసాయ విద్యాలయం సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, కంది పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ లను ఒక ప్రకటనలో అభినందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

ఈ నెల 31న కంది పరిశోధనా కేంద్రంలో తాండూరు రైతులు, శాస్త్రవేత్తలను అభినందించనున్న మంత్రులు, శాస్త్రవేత్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *