అనగనగా ఒక చిన్న రాజు.మంచి రాజు, ఆయనకు తొమ్మిది మంది సంతానం. రాజు ఒక దశలో రాజ్యం కోల్పోయాడు. పేద వాడయ్యాడు. రోగం వచ్చి సకాలంలో వైద్యం అందక చనిపోయాడు. అపుడు కొడుకులంతా నలుమూలలా జైత్రయాత్రకు వెళ్లి దేశాన్నంతా జయించుకొచ్చారు. ఎలా అని… ఒక కథరాస్తే అది శ్రీలంక దేశాధ్యక్షుడు గోటబాయ రాజపక్ష కుటుంబానికి అతికినట్లు సరిపోతుంది.
***
దక్షిణాసియా దేశాల్లో ఒక రోగం బాగా ముదురుతూ ఉంది. ఇతర ప్రపంచ దేశాల్లోల కూడా ఈరోగం కనిపించినా, దీని రోగలక్షణాలు ప్రమాదకరమయిన దేశాలు బాగా తక్కువ. మందులేని ఈ రోగం పేరు కుటుంబ పాలన (Dynasty). పూర్వం డెమోక్రసీ లేని రోజుల్ల బలవంతుడు రాజయ్యేవాడు. అంతే, ఆయన కుటుంబమంతా రాచరికం వెలగబెట్టేది. ఇపుడు రాజకీయ ధనవంతుడు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి సకుటుంబసపరివారానికి అధికారం పంచుతున్నాడు.
భారత జాతీయ రాజకీయాల నుంచి అనేక రాష్ట్రాలు మొదలుకుని తూర్పు పడమర , దక్షిణ దేశాలల దాకా ఈ డైనాస్టీ రోగం బాగా కనబడుతుంది.
ఈ రోగ లక్షణం రాజపక్ష కుటుంబ పాలనలో నడుస్తున్న శ్రీలంకలో బాగా ముదిరింది. దీనితో అక్కడి ప్రజల ఆకుటుంబాన్ని ఎన్నుకున్నందుకు శిక్ష అనుభవిస్తున్నారు. అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులో లేవు. పాలు లేవు, కరెంటు లేదు, పెట్రోలు , డిసెల్ లేవు. మాంసం, కోడి గుడ్లు మార్కెట్ల నుంచి మాయమయ్యాయి. స్కూళ్లు మూసేశారు. ప్రజలు రోడ్లెక్కి దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్ష భవనం దగ్గిరికి వెళ్లి నిరసన తెలిపారు. అన్ని ప్రభుత్వాల లాగే రాజపక్ష ప్రభుత్వం కూడా ఇది తీవ్ర వాదుల చర్య అని ముద్రవేసి దేశంలో ఎమర్జన్సీ విధించింది. కర్ఫ్యూ విధించింది. గొటబాయ రాజపక్ష రాజీనామా చేయాలనే డిమాండ్ తీవ్రంగా కావడంతో ఆర్థిక మంత్రి తమ్ముడిని క్యాబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశాడు. అంతేకాదు, తర్వాత మొత్తం క్యాబినెట్ ను బర్తరఫ్ చేశారు. మరొక సోదరుడు ప్రధానమంత్రి మహేంద రాజపక్షను మాత్రం కొనసాగిస్తున్నారు. ఇంకా దిగి వచ్చి, ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం రారండని ప్రతిపక్ష పార్టీలన్నింటిని ఆహ్వానించాడు.అది శ్రీలకం దీన స్థితి.
శ్రీలంక బడ్జెట్ మీద రాజక్ష కుటుంబ సభ్యుల క్యాబినెట్ మంత్రులకు 75 శాతం దాకా కంట్రోల్ ఉంది. మొత్తం కుటుంబం పదవుల్లో ఉన్నారు. క్యాబినెట్ లో 30 మంది ఉంటే రాజపక్ష కుటుంబ సభ్యులు ఏడుగురు మంత్రులు, వారిచేతిలో 9 శాఖలున్నాయి. రాజపక్షాల ఏలు బడిలో వచ్చినంత ఆర్థిక సంక్షోభం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎపుడూ ఎదురుకాలేదు.
మహింద రాజపక్ష అధ్యక్షుడిగా ఉన్నపుడు తన కుమారుడు నిమల్ రాజపక్షను తన వారసుడిగా చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. 2015 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం నిమల్ కు పట్టాభిషేకం కుదరలేదు. అయితే, 2019లో మళ్లీ కుటుంబానికి పగ్గాలు వచ్చాయి. కుమారుడు క్యాబినెట్ మంత్రి అయ్యాడు.
రాజపక్ష కుటుంబం నుంచి మాట్లాడుకునే ముందు శ్రీలంక రాజకీయాల గురించి ఒక మాట చెప్పుకోవాలి. అదేంటంటే శ్రీలంక మూడు కుటుంబాల కథ. 1948, ఫిబ్రవరి 4న శ్రీలంక కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా కేవలం మూడు కుటుంబాలే దేశాన్ని పరిపాలించాయి. అవి, సేనానాయకే, బండారు నాయకే, రాజపక్ష.
కుటుంబలో పదవుల పందేరం
దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్ష. ప్రధానమంత్రి మహింద రాజపక్ష, క్యాబినెట్ లో తొమ్మిది మంది తమ్ముళ్లున్నారు. ఇందులో బాసిల్ రాజపక్ష (70) ఆర్థిక మంత్రి. అందరికంటే చిన్న తమ్ముడి పేర నమల్ రాజపక్ష. ఆయన వయసు 35సంవత్సరాలు. ఆయన యువజన, క్రీడా శాఖ మంత్రి. రాజపక్ష సోదరుల్లో అందరికంటే పెద్ద వాడు చమల్ రాజపక్ష. ఈయన వయసు 78సంత్సరాలు. ఆయన ఇరిగేషన్ మంత్రి. చమల్ రాజపక్ష కుమారుడి పేరు శషీంద్ర రాజపక్ష. ఈయన ప్రపంచంలోని అతిపెద్ద పేరున్న శాఖకు సహాయ మంత్రి. ఇంగ్లీష్ రాస్తే తప్ప అర్థంకాదు. Minister of state for Organic Fertilizer Production; Supply, Regulation of Paddy production and grains; Organic Food, Vegetables, Fruits, Chillies, Onion and Potato Cultivation and Promotion ;Seed Production and Advanced Technology for Agriculture.
అంతేనా, రాజపక్ష సోదరి పేరు గందిని. ఆమె కుమారుడు నిపుణ రణవాక పార్లమెంటు సభ్యుడు. ఇక ప్రధాని మహింద రాజపక్ష ఒక కుమారుడు యోషిత్ రాజపక్ష నౌకా దళంలో కీలకమయిన అధికారి. మరొక కుమారుడు ప్రధాని కార్యాలయంలో చీఫ్ అఫ్ స్టాఫ్ మొత్తంగా క్యాబినెట్ రాజపక్ష కుటుంబానికి 9 కీలకమయినశాఖలు దక్కాయ. 75 శాతం బడ్జెట్ వీళ్ళఅదుపులోనే ఉంటుంది.అంటే శ్రీలంకప్రభుత్వం మొత్తం రాజపక్ష కుటుంబ చేతిలో ఉంది.
ఇపుడు ప్రధానిగా ఉన్న మహింద రాజపక్ష డిఎ రాజపక్ష అనే పాతతరం రాజకీయనాయకుడి కుమారుడు. ఆయనకు తొమ్మిది మంది సంతానం. వారి పేర్లు: చమల్, జయంతి, మహిందా, చంద్ర, బసిల్, గోటబాయ, డూడ్లే, ప్రీతి, గందని.
1965 ఎన్నికల్లో తండ్రి రాజపక్ష ఓడిపోయాడు. అంతేకాదు, ఉన్నఆస్తంతా కోల్పోయాడు. దారిద్ర్యంలోకి దిగజారాడు. తినడానికి కూడా తిండిలేని పరిస్థితి. అపుడు ఆయన తొమ్మింది సంతానం చదువుకుంటున్నారు. వాళ్లచదువుకూడా బాగా కష్టమయింది. బత్తెం లేక కారును అమ్మేశాడు. ఉన్న పొలాన్ని తాకట్టు పెట్టాడు. ఈ కష్టాలలో 1967లో ఆయనకు పెద్ద జబ్బు చేసింది. చేతిలో చిల్లి గవ్వలేదు. ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ఒక వాహనం కూడా అందుబాటులోలేకుండా పోయింది. తీరా వాహనం వచ్చే సరికి బాగా ఆలస్యమయింది. ఆసుపత్రిలో చేర్చారో లేదో 1967 నవంబర్ 7న ఆయన చనిపోయాడు.
మహింద రాజపక్ష 2004లో ప్రధాని అయ్యారు. తర్వాత 2005 నుంచి 2015 దాకా దేశాధ్యక్షుడయ్యాడు. అపుడు ఆయన సోదరుడు గొటబాయ రాజపక్ష రక్షణ మంత్రిగా ఉన్నారు. 2009లో ఎల్ టిటిఇ ఇద్దరు సోదురులు కలసి సమూలంతా నిర్మూలించారు. 2009లో ఎల్ టిటిఇ నిర్మూలన తర్వాత తమిళల హక్కలు కల్పిస్తారనుకున్నారు. హక్కులుకాదు, 2009 అంతర్యుద్ధంలో చనిపోయిన వారికి తద్దినాలు పెట్టడాన్ని కూడా మహింద రాజపక్ష నిషేధించాడు. ఆయన హయాంలోనే శ్రీలంక చైనాకు దగ్గిరయి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ప్రాజక్టులకు 7 బిలియన్ డాలర్లు రుణం తీసుకుంది. ఇవన్నీ ఆర్థిక భారం మోపాయి తప్ప ప్రయోజనం చేకూర్చలేదు. అపుడే రాజపక్ష ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి.
మహింద హయాంలో చమల్ రాజపక్ష లోక్ సభ స్పీకర్ గా ఉన్నారు. బసిల్ రాజపక్ష మంత్రిగా ఉండినారు. 2015 దాకా రాజపక్ష పాలన సాగింది. ఆయేడాది మహింద రాజపక్ష అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాడు. అయితే, 2019 ఎన్నికల్లో దేశాధ్యక్షుడిగా గొటబాయ రాజపక్ష ఎన్నిక కావడంతో మళ్లీ రాజపక్షకుటుంబం అధికారంలోకి వచ్చింది. అంతే, మహింద ఈ సారి మహిందని ప్రధాని నియమించారు. అంతే, రాజపక్ష సైన్యం ఒకరి తర్వాత ఒకరు మొత్తం కీలకపదవులను ఆక్రమించేశారు అంతకాదు, రాజ్యాంగాన్ని సవరించుకుని (20వ రాజ్యాంగ సవవణ) దేశాధ్యక్షుడికి తిరుగులని అధికారాలు తెచ్చుకున్నారు. ఈ రాజ్యంగ సవరణ ప్రకారం దేశాధ్యక్షుడి తనికిషమయిన వ్యక్తులెవరినైనా మంత్రులుగా నియమించుకోవచ్చు, తన దగ్గిర ఎన్ని శాఖలైనా ఉంచుకోవచ్చు. వాళ్ల అధికారాలను మార్చవచ్చు.రెండు న్నర సంవ్సరాల అనంతరం పార్లమెంటును రద్దు చేయవచ్చు.తనకి ష్టమయిన వారిని సుప్రీంకోర్టు జడ్డిలుగా నియమించుకోవచ్చు.
గొటబాయ చాలా పాపులారిటీతో దేశాధ్యక్షుడిగా 2019లో ఎన్నికయ్యారు. రికార్డు స్థాయిలో ఆయనకు 6.9 మిలియన్ ఓట్లు పడ్డాయి. తర్వాత 2020 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన పార్టీకి మూడింట రెండు వంతుల మెజారిటీ వచ్చింది. 2021 నాటికి ఆయన బాగా అపకీర్తి పాలయ్యారు. దేశమంతా సమ్మెలు మొదలయ్యాయి. వైద్యం, విద్య, రైల్వే, విద్యుత్ , ప్లాంటేషన్ రంగాలు సమ్మెలతో దద్దరిల్టిపోయాయి. గతంలో చేసిన అప్పుల మీద చెల్లింపుల భారం తీవ్రమయింది. 2026నాటికి శ్రీలంక ప్రభుత్వం 29బిలియన్ డాలర్ల రుణాలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం దగ్గిర ఉన్న విదేశీమారక ద్రవ్యం నిల్వలు 4 బిలియన్లు మించిలేవు. ఇది కేవలం 2.7 నెలలలో సరిపోతాయని మీడియా రాస్తూ ఉంది.
ఇపుడు రాజపక్ష కుటుంబ ఎంత శక్తివంతమయిందంటే… అధికారాన్ని ఆ కుటుంబం నుంచి లాక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే, ఆ కుటుంబం బ్రిటిష్ కాలం నుంచి రాజకీయాల్లో వేళ్లూని కుని ఉంది. ప్రజలు ఇపుడు ఇంత కష్టాల్లో ఉన్నా రాజపక్షమేనని వాళ్ల ఫ్యామిటీ పొలిటికల్ హిస్టరీ చెబుతుంది. ప్రజలకు ఇంకారాచరికం మీద మోజు పోలేదేమో దక్షిణాసియాలో…