మార్చి 23, భగత్ సింగ్ వర్ధంతి. ఆయన అమరవీరుడయిన రోజు.
చండీగడ్ సమీపాన మొహాలీ లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు స్వాతంత్య్రయోధుడు, అమరవీరుడు భగత్ సింగ్ పేరు పెట్టడానికి 14 సంవత్సరాలుగా భారతదేశం తెల్చుకోలేకపోతున్నది అయితే, పాకిస్తాన్ మాత్రం ఈ సమస్యను చాలా తొందరగా తేల్చేసింది. లాహో ర్ పట్టణంలోని షాద్మన్ చౌక్ కు భగత్ సింగ్ చౌక్ అని పేరు పెట్టేసింది.
ఇదెలా జరిగిందంటే…
భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులని లాహోర్ సెంట్రల్ జైలులోనే 1931 మార్చి 23న ఉరితీశారు. ఇది సాధారణమయిన ఉరికాదు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎందరినో బ్రిటిష్ వారు ఉరితీశారు. అయితే, తెల్లదొరలు ఆగలేదు. వారి మృత దేహాలను ఉరి మంచె మీద నుంచి బయటకు లాక్కొచ్చి ముక్కలు ముక్కులగా నరికి, గొనే సంచులలో కుక్కి, రాత్రి చీకట్లు ప్రపంచం నిద్రలో ఉన్నపుడు సమీపంలో సట్లేజ్ నదీ తీరాన ఉన్న కసూర్ గ్రామానికి తీసుకువచ్చి ఒక శిక్కు, ఒక హిందూ పురోహితులతో రహస్యంగా ప్రార్థనలు జరిపించి, కాల్చేశారు. అయితే, తెల్లవారితే కసూర్ ప్రజలు తిరగబడతారనే భయంతో సగం కాలిన శవాల ముక్కలను నదిలోకి విసిరేసిపోయారు.అయితే, తెల్లవారాకా ఉరిప్రజలకు అనుమానం వచ్చింది. వెంటనే శవాలు కాల్చిన స్థలంవైపు పరుగుతీశారు. వారి అనుమానం ధృవపడింది. నదిలోకి దూకి శరీర బాగాలను బయటకు తీసి వారికి నివాళులర్పించి ఖననం చేశారు.
ఉరికంబాన్ని ఎక్కబోతూ భగత్ సింగ్ పాడిన గేయం మరపు రానిది. ‘Dil se nikilegi na maker bhi want ki ulfat/ meri mittee se bhi khusbhuye watan aegi ‘( When we are dead there would be still patriotism left in us/ Even my corpse will emit the fragrance of my motherland).
ఉరికంబం మీద ముగ్గురు మిత్రులు ఉరితాడును ముద్దాడారు. వారి ముఖాల్లో వర్చస్సును జైలుజీవితం, ఉరిశిక్ష మసక బార్చలేదు. ఉరి తాడు మెడకు బిగుసుకుంది. తర్వాత ఏమయిందో The Print లో సత్విందర్ సింగ్ జస్ రాశారు ఇలా.
“Afterwards, their bodies were hurriedly taken down from the gallows. They were dragged along the dirty passageway, chopped into pieces, and stuffed into sacks, which were then whisked out of the jail compound surreptitiously. Outside the Jail, the remains were unceremoniously stacked on a truck. The truck made haste, speeding northwards and Lahore to Kasur, some hours’ drive away. There on the banks of River Sutlej…. The dismembered bodies, which were quickly loaded into funeral pyre …the charred remains were then hurled into the river.”
స్వాతంత్య్ర పోరాట కాలంలో బ్రిటిష్ ప్రభుత్వ దౌష్ట్యాల మీద ఈ ముగ్గురు కుర్రవాళ్లు ఆగ్రహోదగ్రులయ్యారు.తిరుగుబాటు చేశారు. రక్తానికి రక్తమే మార్గం అనుకున్నారు. సాయుధులయ్యారు. 1928లో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో రాజకీయ పరిస్థితిని పరిశీలించేందుకు సైమన్ కమిషన్ ను నియమించింది. ఇందులో భారతీయులెవరూ లేకపోవడంతో నిరసన మొదలయింది. కమిషన్ లాహోర్ కు వచ్చినపుడు నిరసన కు లాలా లజపతిరాయ్ నాయకత్వం వహించారు. అపుడు పోలీస్ సూపరింటెండెంట్ జేమ్స్ ఎ స్కాట్ లాఠీ చార్జ్ చేయమన్నారు. ఇందులో లాలా లజపతి రాయ్ కి తీవ్రంగా గాయాలయ్యాయి. వీటి వల్ల ఆయన కు పరిస్థితి విషమించి 1928 నవంబర్ 17న గుండె పోటుతో మరణించారు. దీనికి వ్యతిరేకంగా స్కాట్ మీద ప్రతికారం తీర్చుకోవాలని భగత్ సింగ్, శివ్ రామ్ రాజ్ గురు, సుఖ్ దేవ్ థాపర్, చంద్రశేఖర్ ఆజాద్ బృందం ఏర్పాటు చేసిన హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ శపథం చేసింది. వాళ్లు జేమ్స్ స్కాట్ కు బదలు పొరపాటున డిసెబబర్ 17, 1928న అసిస్టెంట్ ఎస్ పి జాన్ పి సాండర్స్ ను లాహర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ బయట చంపేశాడు. ఈ కేసులోనే 1930 అక్టోబర్ 7న స్పెషల్ ట్రిబ్యునల్ ఉరిశిక్ష విధించింది. మార్చి 23, 1931 సాయంకాలం ఏడున్నరకు లాహో ర్ జైల్ లో వారి ఉరితీశారు.
ఇది కూడా చదవండి
పాకిస్తాన్ నివాళి
1961లో లాహోర్ సెంట్రల్ జైల్ ను కూల్చేశారు. అక్కడ షాద్మన్ చౌక్ నిర్మించారు. అయితే, పాకిస్తాన్ భగత్ సింగ్ అభిమానులు మాత్రం ఆయన చౌక్ లో నివాళులర్పిస్తూనే ఉన్నారు. 2019 మార్చి 23న భగత్ సింగ్ మొమోరియల్ ఫౌండేషన్ ఘనంగా నివాళులర్పించింది. ఈ విషయాన్ని Indian Express రిపోర్టు చేసింది. ఫౌండేషన్ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవాది రషీద్ ఖురేషి 2018లో లాహోర్ హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తూ షాద్మన్ చౌక్ ను భగత్ సింగ్ చౌక్ గా నామకరణం చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఎందుకంటే, భగత్ సింగ్ తదితరులను ఉరితీసిన ప్రదేశంలోనే ఈ చౌక్ నిర్మాణం జరిగింది. ఈ పిటిషన్ లో కోరినట్లు చౌక్ నామకరణం మీద ఒక నిర్ణయం తీసుకోవాలని లాహర్ హైకోర్టుకు లాహర్ మేయర్ ను ఆదేశిచింది. దీని మీద ఇంకా ఎలాంటి కోర్టు నిర్ణయం రాలేదు. అయితే, లాహోర్ జిల్లా యంత్రాంగం మాత్రం షాద్మన్ చౌక్ ను భగత్ సింగ్ చౌక్ గా ప్రకటించినట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ రాసింది. దీనికి సంబంధించిన డాక్యమెంట్ లో భగత్ సింగ్ తో పాటు ఉరికంబం ఎక్కిన సుఖ్ దేవ్, రాజగురులను Great Revolutionary Leaders అని పేర్కొంది.
దీనితో 2019 మార్చి 23న భగత్ సింగ్ చౌక్ భగత్ సింగ్ అమర్ రహే, భగ త్ సింగ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, నీ స్వప్నం దూరం లేదు, మేమంతా పూర్తి చేస్తాం అని నినాదాలతో మారుమ్రోగింది.