పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో నాటు సారా మూలంగా మృతి చెందినవారి కుటుంబాలను జనసేన నేతలు కలిశారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన నాయకులతో ఆ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయంగా పదివేలు రూపాయల అందంచారు.
గత వారం పశ్చిమ గోదావరి జిల్లాలో కల్తీసారా తాగి చాలా మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు బాగా పెరిగిపోవడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా నాటుసారా కాచుతున్నారు. ఇందులో కల్తీ సారా కూడా ఉంటున్నది. ఇలాంటి సారా తాగినందునే జంగారెడ్డి గూడలో మరణాలు సంభవించాయని, నాటుసారా విపరీతంగా పెరిగిపోయేందుకు ప్రభుత్వ వత్తాసు ఉన్ననేతలే కారణమని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆందోళన చేస్తూ ఉంది. అసెంబ్లీని కూడా స్తంభింప చేసింది.అయితే, ప్రభుత్వానికి నాటుసారా ను ప్రోత్సహించాల్సిన అవసరం లేదని, అయినా జంగారెడ్డి గూడెం లాంటి పట్ణణంలో నాటుసారా విక్రయించడం సాధ్యం కాదని , తెలుగుదేశం పార్టీ కేవలం ఈ మరణాలను రాజకీయం చేస్తూ ఉందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు.
ఇలా ఉంటే గతంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయడు కూడా ఈ వూరును సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇపుడు జనసేన నేతలు వచ్చారు.