“7 రోజులేనా? ఇదేం అసెంబ్లీ సెసెన్”

*అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సీఎల్పీ నేత భట్టి విక్ర‌మార్క‌, ఎమ్మేల్యే శ్రీ‌ధ‌ర్‌బాబు, జ‌గ్గారెడ్డిల ప్రెస్‌మీట్‌

***

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 7 రోజులకు మాత్రమే పరిమితం చేశారు. దీని వ‌ల్ల బ‌డ్జెట్‌పై అర్ధ‌వంతమైన చ‌ర్చ జ‌రుగ‌లేదు.

దేవాల‌యం లాంటి శాస‌న స‌భ‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గళం వినిపించే ప్ర‌తిప‌క్షాల గొంతు నొక్కారు. లోతైన చ‌ర్చ జ‌రుగ‌కుండ సమయం చాలా తక్కువగా ఇచ్చారు.

ప్ర‌భుత్వ త‌ప్పిదాల‌ను లేవ‌నెత్తి ప్ర‌శ్నించేందుకు ప్ర‌య‌త్నించిన కాంగ్రెస్ ఎమ్మేల్యేల‌ను మాట్ల‌డ‌నివ్వ‌కుండ అడ్డుప‌డ్డారు. అధికార‌పార్టీ స‌భ్యులు ర‌న్నింగ్ కామెంట్రీ చేస్తూ రెచ్చ‌గొట్ట‌డం, స‌భ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌డం చేయ‌డాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాము.

ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలను ఎక్కువ రోజులు నడిపించాలని బీఏసీ లో చెప్పాము…

15 న బీఏసీ సమావేశం నిర్వహించి చెప్తామ‌నని ప్ర‌భుత్వం స‌మావేశాల‌ను వాయిదా వేయ‌డం ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లి పెట్టు.

రైతు బంధు ఒకటే కాదు.. గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతుల‌కు ఇచ్చిన‌టువంటి వడ్డీ లేని రుణాలు,సబ్సిడీ తో ఇచ్చే పనిముట్లు, విత్తనాలు, ఎరువులు ఇవ్వాలి..

ప్రభుత్వం నుండి కట్టించే డబుల్ బెడ్ రూమ్ లు కొనసాగించాలని, నిరుద్యోగ భృతి గురించి అడిగితే స‌ర్కార్ ఏలాంటి స‌మాధానం ఇవ్వ‌లేదు..

జాతీయ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగిస్తే కాంగ్రెస్ తరుపున ప్రభుత్వం పై రెండు సంవ‌త్స‌రాలుగా తీవ్ర వత్తిడి చేయ‌డంతో సీఎం కేసీఆర్ వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటాన‌ని ఈ రోజు ప్ర‌క‌టించారు.

ఐకెపి ,మెప్మా సిబ్బందికి పే స్కెలు ఇచ్చేలా స‌ర్కార్‌ను ఒప్పించగాలిగాం.. ఈ రోజు అసెంబ్లీలో వారికి అనుకూలంగా ప్ర‌భుత్వంతో ప్ర‌క‌ట‌న చేయించ‌గ‌లిగాము.

విఆర్ఏల స‌మ‌స్య‌ల గురించి అసెంబ్లీలో గ‌ళం వినిపించాను. వారికి ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించ‌డంతో పాటు పే స్కేల్ ఇవ్వాల‌ని స‌ర్కార్‌ను కోర‌డం జ‌రిగింది. సీఎం దృష్టికి వారి స‌మ‌స్య‌ను ఈ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా తీసుకువెళ్లాను. ప్ర‌భుత్వం వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఆలోచ‌న చేస్తామ‌ని హామీ ఇచ్చింది.

2021-22 సంవ‌త్స‌రం బడ్జెట్ లో రూ. 50 నుంచి 60 వేల కోట్ల రెవెన్యూ లోటు కనిపిస్తోంది. మ‌రో రూ. 50 వేల కోట్లు అప్ప‌లు తెస్తామ‌ని పేర్కొన్నారు. ఈ బ‌డ్జెట్‌లో సుమారు రూల‌క్షా కోట్లు ఆదాయ లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

2024 -25 సంవ‌త్స‌రాం నాటికి రాష్ట్ర అప్పులు 5 లక్షల కోట్ల దాట‌డం ఖాయం. ఇప్ప‌టికే దాదాపు నాలుగు ల‌క్ష‌ల కోట్లు దాటింది. మూడు సంవ‌త్స‌రాల క్రితం రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడిన‌ప్పుడు స‌ర్కార్ మ‌మ్మ‌ల్నీ అవ‌హేల‌న చేసింది. ఆరోజు మేం చెప్పిందే ఇప్పుడు స్ప‌ష్టమైంది. ఈరోజుకు 4 లక్షల 70 వేల కోట్ల అప్పు ఉంది..

రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్ధిక క్ర‌మ‌శిక్ష‌ణ దాటి విప‌రీతంగా చేస్తున్న అప్పుల వ‌ల్ల రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లపైన పెను భారం ప‌డుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *