కరోనా సెకండ్ వేవ్ నాటి పరిస్థితులు తలెత్తకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రాణ వాయువు కొరతనేది లేకుండా ఉండేలా ‘జగనన్న ప్రాణవాయువు’ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
రాష్ట్రంలో గాలి నుంచి ఆక్సిజన్ తయారు చేసే పీఎస్ఏ ప్లాంట్లు (Oxygen plants)ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 124 ఆసుపత్రుల్లో 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభిస్తున్నారు. విధానంలో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 144 ప్లాంట్లను ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నాయి.
రు.189 కోట్లతో ఈ ప్లాంట్లను నిర్మించారు. ఈ ప్రాంట్ల ద్వారా నిమిషానికి 5 వందల నుంచి వేయి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. మొత్తం అన్ని ప్లాంట్ల నుంచి నిమిషానికి 93 వేల 6 వందల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి కానుంది. రాష్ట్రంలో 24 వేల 419 బెడ్స్‌కు ఆక్సిజన్ పైప్‌లైన్స్ ఏర్పాటయ్యాయి.
35 ఆసుపత్రుల్లో 399 కిలోలీటర్ల సామర్ధ్యంతో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లు ఏర్పాటయ్యాయి. 39 ఆసుపత్రులకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లు కొనుగోలు చేయనుంది ప్రభుత్వం. ఆక్సిజన్ సరఫరా నిమిత్తం 20 కిలోలీటర్ల సామర్ధ్యం కలిగిన 25 కంటైనర్లను కొనుగోలు చేశారు.
కరోనా థర్డ్‌వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. ప్రజలకు మెరుగైన వైద్యం అధించేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని వసతులు ఏర్పాటు చేశారు.