(ఇఫ్టూ ప్రసాద్ పిపి)
*నెల్లిమర్ల అమరజీవి దువ్వారపు చిన్నా భార్య అప్పల నర్సమ్మ మృతి
వీరోచిత నెల్లిమర్ల కార్మికోద్యమ అణచివేత లో భాగంగా 29-1-1994 నాటి పోలీసు కాల్పుల్లో వీర మరణం పొందిన ఐదుగురు అమర జీవుల్లో దువ్వారపు చిన్నా ఒకరు. ఆయన భార్య అప్పల నర్సమ్మ గారు మృతి చెందిన దుర్వార్త ఇప్పుడే అందింది.
అప్పల నర్సమ్మ గారు గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. షుగర్ వ్యాధికి మరికొన్ని అనారోగ్య సమస్యలు తోడయ్యాయి. హాస్పిటల్ చికిత్స పొందారు. ఐతే నయమయ్యే అవకాశం లేని కారణంగా ఇంటికి తీసుకెళ్లమని వైద్యులు మొన్న చెప్పారట. ప్రస్తుతం విజయనగరం టౌన్ లోని పెద్ద కొడుకు నర్సింగ్ రావు ఇంటివద్ద ఉంచారు. ఈ సీరియస్ స్థితి నిన్ననే తెలిసింది. వెంటనే ఈరోజు బయలు దేరాను. బ్రతికివుండగా చివరి చూపు చూద్దామని వెళ్తున్నా. మార్గమధ్యంలో సరిగ్గా రాజమండ్రి దాటే సమయంలో ఆమె మరణ వార్త అందింది. కడసారి ఆమెని పరామర్శ చేసే ఉద్దేశ్యంతో వెళ్తున్న నాకు, ఆమె అంత్యక్రియలకు హాజరయ్యే పరిస్థితి ఏర్పడటం ఓ విషాధమే!
అప్పల నర్సమ్మ గార్కి మనస్సులోనే జోహార్లు అర్పిస్తూ, ఆమెతో, ఆ కుటుంబంతో గతకాలపు ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, నా ప్రయాణాన్ని సాగిస్తున్నా. ఈ సమాచారాన్ని మిత్రులకు అందిస్తున్నా.
ఇది కూడా చదవండి
ఓ మరపురాని మధుర రాజకీయ జ్ఞాపకానికి నేటికి 30 ఏళ్ళు