తిరుమల, 2021 అక్టోబరు 13:
2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలోపటికబెల్లం, కివి పండ్లు, ఎరుపు పవిత్రమాలలతో శోభాయమానంగా స్నపన తిరుమంజనం జరిగింది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిసారిగా పటికబెల్లం, కివిపండ్లు, ఎరువు పవిత్రమాలలతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలు, కిరీటాలతో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేదమంత్రాల నడుమ కంకణభట్టార్ శ్రీ వాసుదేవ భట్టాచార్యులు ఈ కార్యక్రమం నిర్వహించారు.
దాదాపు రెండు గంటల పాటు జరిగిన స్నపన తిరుమంజనంలో కురువేరు, తెల్లపట్టు, రంగురంగుల ఎండుఫలాలు, వట్టివేరు, పసుపు రోజామాలలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి అలంకరించారు. వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా అర్చకస్వాములు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. శోభాయమానంగా సాగిన ఈ స్నపన తిరుమంజనాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
తిరుపూర్ కు చెందిన దాత శ్రీ రాజేందర్ సహకారంతో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక మాలలు, కిరీటాలు, హైదరాబాద్‌కు చెందిన శ్రీ శ్రీనివాస్, శ్రీ శ్రీధర్ సహకారంతో రంగనాయకుల మండపం అలంకరణ చేశామని టిటిడి ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు.
స్నపన తిరుమంజనం అంటే ఏమిటి?
https://trendingtelugunews.com/snapanam-performed-at-tirumala-what-is-snapanam/