తమని తమ కుటుంబాలకు భద్రత కల్పించండి అఫ్గానిస్తాన్ కు చెందిన జర్నలిస్టు, టివి కెమెరామెన్, ఫోటో గ్రాఫర్లు, ఇతర సిబ్బంది ఐక్య రాజ్యసమితి, అంతర్జాతీయజర్నలిస్టుల సంఘాలకు,మానవ హక్కుల సంస్థలకు విజ్ఞప్తి చేశారు.
150 జర్నలిస్టుల ఈ పిలుపు పత్రం మీద సంతకం చేశారు.
దూరంగా నిలబడుకుని అఫ్గాన్ నాటకాన్ని చూడటం కాదు, ఆఫ్గానిస్తాన్ వాక్ స్వాతంత్య్రం కోసం ఇరవై ఎళ్లుగా ధైర్యంగానిలబడిన జర్నలిస్టులకు ప్రపంచమంతా బాసటగా ఉండాలని, వాళ్ల హక్కులకోసం తగిన చర్యలు తీసుకోవాలని ఈ జర్నలిస్టులు విజ్తపి చేశారు.
“Considering the increased challenges and threats facing media workers, as well as their families and property, we urge the United Nations and donor countries to take action to save lives and our families,” అని వారు లేఖలో పేర్కొన్నారు.
తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నాక చాలా మంది మహిళా జర్నలిస్టులు ఉద్యోగాలు కోల్పోయారు. ఉపాధికోల్పోయారు. వారికుటుంబా ఉన్నట్లుంది ఆర్థిక సంక్షోభంలో పడిపోయాయి. ఇలాంటి వారిలో నజీఫా అహ్మది ఒకరు. ఆమె పనిచేస్తున్న కంపెనీ తాలిబన్ల దాడుల వల్ల మూత పడింది.
వార్త సంస్థల్లో మహిళలు పనిచేసే స్వేచ్ఛ కల్పించాలని ఆమె తాలిబన్లను కోరుతున్నారు. చాలా మంది మహిళలేకుటుంబాలకు జీవనాధారం అనే విషయాన్ని కూడా తాలిబన్లు గుర్తుంచుకోవాలని ఆమె కోరుతున్నారు.
కాబూల్ విమానాశ్రయం దగ్గిర దాడుల్లో ఇంతవరకు ముగ్గురు జర్నలిస్టులు చనిపోయారు.