అఫ్గాన్ యాంకర్ చుట్టూ తాలిబన్లు… ఇదీ పరిస్థితి

అఫ్గానిస్తాన్ పరిస్థితి మీద వైరలైన వీడియో ఇది. అఫ్తాన్ కు చెందిన ఒక టివి యాంకర్ మీద తాలిబన్లు పెట్టిన నిఘా ఇది. దీనితో యాంకర్ ముఖకవలికలు చూశారా.ఏ మాత్రం హావభావాలువ్యక్తం చేసే ధైర్యం చేయడం లేదు. అఫ్గాన్ టివి (Afghan TV)కి చెందిన పీస్ స్టూడియో పొలిటికల్ డిబేట్ సమయం తీసిన క్లిప్ ఇది. తాలిబన్ ఇపుడు పేరు మార్చకుంది.తనని తాలిబన్ అని కాకుండా ఇస్లామిక్ ఎమిరేట్ అని పిలవాలనుకుంటూ ఉంది. ఆఫ్ఘాన్ టివి పొలిటికల్ డిబేట్ లో తాలబిన్లు ప్రజలకు “ప్రజలు భయపడాల్సిన పనిలేదు. మాకు సహకరించండి,’ అని కోరారు.దీనికి సంబంధించిన 42 నిమిషాల వీడియో క్లిప్ ని బిబిసికి చెందిన కియాన్ షారిఫి ట్టిట్టర్ లో షేర్ చేశారు. అది వైరలయింది.

తమ లో మార్చు వచ్చిందని ప్రపంచాన్ని నమ్మించేందుకు తాలిబన్లు ఒకప్రచారం చేస్తున్నారు. మరొక వైపు తమ పాతపద్దతులను అమలు చేస్తూ ప్రజలను,జర్నిలిస్టులను హింసిస్తున్నారు. దాడులు చేస్తున్నారు. ఇల్లిల్లు తిరిగి సోదా చేసి తాలిబన్ వ్యతిరేకులందరి ఏరిపారేసే పనిలో పడ్డారు.ఇంకొక వైపు షిరియా సూత్రాలను అమలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో యాంకర్ ను తాలిబన్లు చుట్టుముట్టి టివి డిబేట్ ను కొనసాగించిన విధానం చూస్తే, అక్కడి పరిస్థితి ఎలా ఉంవదో అర్థమవుతుంది. అందుకే ఈ వీడియోవైరలయ్యింది.

 

 

రిపోర్టర్స్ వితౌడ్ బార్డర్స్ అనే సంస్థ సమాచారం ప్రకారం  ఆగస్టు 15న తాలిబన్లు  కాబూల్ ను వశం చేసుకున్నప్పటి నుంచి ఏడుగురు జర్నలిస్టుల మీద దాడులు జరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *