ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్టికిల్ 19 రద్దు చేశారా?: టీడీపి అనుమానం

(వర్ల రామయ్య, టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యుడు)

రాష్ట్రంలో మానవహక్కులకు తీవ్ర విఘాతంకలుగుతోందని, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంద్వారా దేశంలోని పౌరులకు సంక్రమించినకొన్ని హక్కుల్లోని భావప్రకటనాసేచ్ఛహక్కు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక ఏపీ ప్రజలకు లేకుండాపోయింది.

జగన్మోహన్ రెడ్డి అరాచకం చేస్తున్నా, తప్పులమీద తప్పులుచేస్తున్నా అందరూ ఆయనకు జీహూజూర్ అనాలని డీజీపీ భావిస్తున్నారా?


ఆంధ్రప్రదేశ్ లో మానవహక్కుల ఉల్లంఘన, ఆర్టికల్ 19 దుర్వినియోగంపై జాతీయమానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ కు లేఖరాసిన వర్ల రామయ్య.


రాష్ట్రంలో ఆర్టికల్ 19 అనేది తాత్కాలికంగా రద్దుచేయబడినట్టు  అనిపిస్తోంది.

రాష్ట్రంలో ఎవరూ ఎలాంటినిరసన తెలియచేయడానికి, వారిభావాలను వ్యక్తంచేయడానికి, స్వేచ్ఛగా మాట్లాడటానికి అవకాశంలేదు. చూడబోతే ఇవన్నీ ప్రతిపక్షసభ్యులకే  ఆంక్షలు వర్తించేలా డీజీపీ వ్యవహరిస్తున్నారు. నిషేధం, బలవంతమనేవి తెలుగుదేశంపార్టీ పై రుద్దడానికే వినియోగిస్తున్నారు.

తెలుగుదేశంపార్టీ నిరసనలపై ప్రభుత్వం ఇనుపపాదం మోపుతోంది. కొత్తగా మరోటి మొదలెట్టారు… హౌస్ అరెస్టులంట! హౌస్ అరెస్ట్ చేయడమంటే, ఆర్టికల్ 19ను ఉల్లంఘించడమే. గౌరవ డీజీపీ సవాంగ్ గారికి రాజ్యాంగం గురించి స్పష్టంగా, క్షుణ్ణంగా తెలుసు.

గతంలో ఇదివరకు చంద్రబాబునాయుడుగారు అమరావతిప్రాంతానికి బస్ లో వెళుతుంటే కొందరు దుండగులు అకారణంగా ఆయన వాహనంపై దాడి చేశారు. రాళ్లు, కర్రలు, చెప్పులు విసిరేశారు. ఆనాడు జరిగిన ఘటనను సమర్థిస్తూ, డీజీపీ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

ఆవిధంగా మాజీ ముఖ్యమంత్రి వాహనంపై దాడిజరిగితే, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదేమిటని పాత్రికేయులు డీజీపీని అడిగిన సందర్భం లో ఆయనస్పందిస్తూ, ఆర్టికల్ 19ప్రకారం నిరసన తెలిపే హక్కు భారతీయులందరికీ ఉంది… అలానే అక్కడ దాడిచేసినవారికీ ఉందన్నారు.

మరి ఆనాడు వారికున్న హక్కు, ఈనాడు టీడీపీవారికి, సామాన్యులకు లేదా?

డీజీపీ చెబుతున్న ఆర్టికల్ 19 హక్కులు టీడీపీవారికి సంక్రమించవా?

ఆతరువాత మరోసారి కూడా విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకున్నారు.

దానిపై కూడా డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ ఘటనలోనే కోర్టు డీజీపీతో సీఆర్ పీసీ 151 గురించి చదివించింది.

ఇంతజరిగినా, కోర్టులు పలుమార్లు మొట్టికాయ లు వేసినా డీజీపీలో మార్పులేదు.

మొన్నటికి మొన్న కొండపల్లి అక్రమ మైనింగ్ ను పరిశీలించడానికి వెళ్లిన దేవినేని ఉమాపై దాడిచేసి, తప్పుడు కేసులు పెట్టి, అకారణంగా జైలుకుపంపారు.

ఆ వ్యవహారంలో ముద్దాయి ఫిర్యాదుదారు అయితే, పిర్యాదుదారు ముద్దాయి అయ్యాడు.

తరువాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిజనిర్థారణ బృందా న్ని నియమించి, అక్రమమైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించమని చెప్పారు.

తమతోపాటు ప్రభుత్వబృందాన్నికూడా పంపాలని కృష్ణాజిల్లా కలెక్టర్ ను కూడా కోరాము. కానీ ఆయనెందుకో పంపలేకపోయారు.

అక్కడకు రేపు వెళదామ నుకున్న టీడీపీ బృందంలోని సభ్యులను ఒకరోజు ముందే హౌస్ అరెస్ట్ చేశారు.

వారిని కనీసం ఇళ్లలోనుంచి కూడా బయటకు రానివ్వలేదు.

మరి వారికి ఆర్టికల్ 19 వర్తించదా? ఆర్టికల్ 19 ద్వారా నిరసనతెలిపేహక్కు అందరికీ ఉందని గతంలో చెప్పిన డీజీపీ, ఇప్పుడుదాన్ని కొందరికే ఎందుకు పరిమితం చేశాడన్నదే తమ ప్రశ్న.

అందుకే ఈవ్యవహారంపై జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించాం.

జాతీయమానవహక్కుల కమిషన్ ఛైర్మన్ శ్రీ హెచ్.ఎల్. దత్తుగారికి ఒకలేఖరాస్తున్నాను.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో, సవాంగ్ నేతృత్వంలో రాష్ట్రంలో మానవహక్కులు ఏవిధంగా హరింపబడుతున్నాయనే దానిపై పూర్తివివరాలతో ఎన్.హెచ్.ఆర్.సీకి లేఖరాస్తున్నాం.

ఈ సమయంలో మానవహక్కులసంఘానికి చెందిన కమిటీ రాష్ట్రంలో పర్యటించకపోతే, ఏవిధంగా ప్రజలహక్కులు హరింపబడుతున్నాయో సదరుకమిటీ పరిశీలించి, ప్రభుత్వానికి బుద్ధిచెప్పకపోతే, డీజీపీ నోరుమూయించకపోతే, ప్రజలెవరూ స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితిలేదని తెలియచేస్తున్నాం.

ప్రశ్నించేనోళ్లను శాశ్వతంగా మూసేయాలని చూస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడటానికి వీల్లేదన్న ట్లు, ప్రభుత్వం ఏకంగా ఒకశాసనమే తీసుకొచ్చేలా ఉంది. ఈ పరిస్థితులన్నీ గమనించిన మీదటే జాతీయమానవహక్కుల కమిషన్ ఛైర్మన్ కు లేఖరాయా లని నిర్ణయించాము.

ఎన్.హెచ్.ఆర్.సీ వెంటనే స్పందించి, నిష్ణాతులైన ప్రత్యేక బృందాన్ని రాష్ట్రపర్యటనకుపంపాలని కోరుతున్నాం. ప్రత్యేక బృందం రాష్ట్రంలో పర్యటించి, ఈ ప్రభుత్వానికి, ఈ డీజీపీకి, ముఖ్యమంత్రికి జ్ఞానబోధచేయాలని, ఎన్.హెచ్.ఆర్.సీ వారినికోరుతున్నాం.

తాము రాస్తున్నలేఖలోని నిజనిజాలను తేల్చాలని కోరుతున్నాం.

జగన్మోహన్ రెడ్డి తప్పుచేసినా అందరూ ఒప్పని, ఆహాఓహో అని చప్పట్లు కొట్టాలని డీజీపీ భావిస్తున్నారా?

తక్షణమే ఆయన తన పంథా, పద్ధతి, విధానం మార్చుకోవాలని పత్రికాముఖంగా డిమాండ్ చేస్తున్నాం.

డీజీపీకి రాష్ట్రంలోని అన్నివర్గాలవారు, అన్నిపార్టీలవారు సమానమే. కాబట్టి, ఆయన అందరికీ సమానహక్కులుకల్పించాలని కోరుతున్నాం.

అదేవిధంగా జగన్ ప్రభుత్వం తక్షణమే ఆర్టికల్ 19ను రాష్ట్రంలో పునరుద్ధరించాలని, తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్నాం.

వివేకానందరెడ్డి గారు పెద్దరాజకీయకుటుంబంనుంచి వచ్చారు.

మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా, అనుమానాస్పదంగా , 2019 మార్చి 15న ఘోరంగా హత్యచేయబడ్డారు.

దాన్ని విజయసాయిరెడ్డి గారు, అక్కడున్నవారు, సాక్షి టీవీవారు గుండెపోటుగా చిత్రీక రించాలని ప్రయత్నించారు.

ఆ సమయంలో చంద్రబాబునాయుడు హత్యకేసు విచారణపై సిట్ దర్యాప్తుకు ఆదేశిస్తే, జగన్మోహన్ రెడ్డి సీబీఐ విచారణకోరారు.

ఆనాడు సీబీఐ విచారణకోరిన వ్యక్తే, తరువాత హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించే సమయానికి తన పిటిషన్ వెనక్కుతీసుకున్నాడు.

ఆయినా సరే, కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. రెండున్నరేళ్లుగా వివేకాహత్యకేసు విచారణను సీబీఐ చేస్తోంది.

సీబీఐ విచారించిన కేసులు ఏమయ్యాయో గతంలో మనం కొన్ని అనుభవాలు చూశాము.

ఆ అనుభవాల నేతృత్వంలో, వివేకాహత్యకేసు విచారణ పర్యవేక్షణను సిట్టింగ్ జడ్జీకి అప్పగించాలని, రాష్ట్ర హైకోర్ట్ చీఫ్ జస్టిస్ వారిని నేను కోరుతున్నాను.

సిట్టింగ్ జడ్జీ నేతృత్వంలో సీబీఐ దర్యాప్తు జరిగేలా హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఆదేశించాలి.

నిత్యం కేసుదర్యాప్తును సిట్టింగ్ జడ్జీ పర్యవేక్షించాలని డిమాండ్ చేస్తున్నాము.

లేకపోతే ఏంజరుగుతుందో తెలియడంలేదు. వివేకా హత్యకేసు విచారణలో న్యాయం జరుగుతోందా..లేక అన్యాయం జరుగుతోందా. … కేసువిచారణ మాయామశ్చీంద్రలా సాగుతోందా అనేదిఎవరికీ తెలియడం లేదు.

సీబీఐ విచారణకు ఆదేశించింది హైకోర్టే కాబట్టి, సిట్టింగ్ జడ్జీ పర్యవేక్షణలో వివేకాహత్యకేసు విచారణ జరిగేలా చూడాలని, తమ గోడు, ఘోషను హైకోర్టు చీఫ్ జస్టిస్ వినాలని కోరుతున్నాను.

సిట్టింగ్ జడ్జీ కేసుదర్యాప్తును పర్యవేక్షించక పోతే, దర్యాప్తు సరిగా జరుగుతుందా…లేక ఎవరిప్రమేయంతోనైనా జరగరానిది, జరగడకూడనిది జరిగే ప్రమాదముందా అనే సందేహం ప్రజలందరిలోనూ ఉంది.

వివేకాహత్యకేసు విచారణను ఇలాగే వదిలేస్తే, చివరిగా రాష్ట్రప్రజంతా ఇదా జరిగిందని నోరు వెళ్లబెట్టే ప్రమాదముంది. ఈ నేపథ్యంలోనే వివేకాహత్యకేసు విచారణను సిట్టింగ్ జడ్జీతో పర్యవేక్షించమని హైకోర్టు చీఫ్ జస్టిస్ వారిని కోరుతున్నాం.

అలానే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తును సిట్టింగ్ జడ్జీ పర్యవేక్షించాలనికూడా కోరుతున్నాం. వివేకా హత్యకేసు చుట్టూ, ఎంతో మంది కాకలుతీరిన పెద్దలున్నారు.

అసలు ముద్దాయిలకు శిక్షపడాలని, వారు న్యాయస్థానం ముందు నిలబడాలి.

వివేకా కుటుంబానికి న్యాయం జరగాలన్నదే తమ అభిలాష. వివేకాకుమార్తె సునీత, హైకోర్టుకు చెప్పిన అనుమానితులు పేర్లలో సీబీఐ ఇప్పటివరకు ఎంతమందిని విచారించింది.

అందుకే సిట్టింగ్ జడ్జీ పర్యవేక్షణలో విచారణజరగాలని కోరుతున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *