తిరిగొచ్చిన  పేగసెస్

– మనష్ ఫిరఖ్ భట్టాచార్జీ

(అనువాదం : రాఘవ శర్మ)

గ్రీకు పురాణంలో పేరు పెట్టి గూఢచర్యం,
మనుగడ కోసం  దైవదత్తమని  నమ్మించడం.

తప్పుడు పనులకు  శ్వేతాశ్వం  పేరున అధికారిక ముద్రతో జయించడం !

బలిసిన  బగ్గల్లా గొట్టాలు,
వాడి మస్తిష్కంలో  మొలకెత్తిన పీడకల.

రెక్కలు లేవు, ఆశలు లేవు
తిరిగొచ్చిన పేగసెస్  శ్వేతాశ్వం

కరోనా  అదును చూసి పంది కొక్కులా దూరింది.

మన మాటలను  వినాలని చూస్తోంది.

దానికవి జీర్ణం కావు.
మన గోప్యత  ఇక ఏ మాత్రం రహస్యం కాదు.

యంత్రాలలో నిక్షిప్తమైంది అది ఎటూ తేల్చదు.

అధికారం అడ్డుపడుతుంది.

మిత్రుడిని నమ్మినట్టు యంత్రాన్ని నమ్మ లేం.

సాంకేతికం ఒక దేశ ద్రోహం,  అది ఎవరితో నైనా చేతులు కలుపుతుంది.

అన్నీ కావాలనుకుని  దురాశ పడేది శత్రువే.

గూఢ చర్య కథలు చరిత్రంత పురాతన మైనవి.
కదిలే  మృగం  ఈ   శ్వేతాశ్వం

కుట్రలు కుహకాలకు అందంగా ముస్తాబవుతుంది.

తన నీడల ప్రపంచంలో  నీడలా కదులుతుంది.

అది పేరు లేని రాక్షసి.
కంటికి కనపడ కుండా పని చేస్తుంది.
మనని మనకు కాకుండా చేస్తుంది.

మనమేదో దాని భూభాగాన్ని ఆక్రమించినట్టు, అది మననే ఆక్రమిస్తుంది

మన ప్రపంచం అక్రమమని, మన జీవితాలనే ఆక్రమిస్తుంది

ద వై ర్ ‘ సౌజన్యం

పేగసేస్ అంటే గ్రీకు పురాణాలలో ఎగిరే రెక్కలున్న తెల్ల గుర్రం

(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *