ప్రభుత్వోద్యోగాలలో ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు రిజర్వేషన్ కల్పించాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం హైకోర్టుకు తెలియ చేసింది. ప్రభుత్వోద్యోగాలలో ఒక శాతం ట్రాన్స్ జెండర్ కు కల్పిస్తారు. దీనితో ఈ తరహా రిజర్వేషన్లలో దేశంలో అగ్రభాగాన నిలిచింది.
ఈ మేరకు ప్రభుత్వం కర్నాటక సివిల్ సర్వీసెస్ జనరల్ రిక్రూట్ మెంట్ (రూల్స్ )1977 చట్టంలో సవరణలు చేస్తున్నట్లు ప్రభుత్వం జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఒకా, జస్టిస్ సూరజ్ గోవింద్ రాజ్ ల ధర్మాసానానికి నివేదించింది.
ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు ప్రభుత్వోద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని వేసిన ఒక పిటిషన్ ను కోర్టు విచారిస్తూ ఉంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. డైరెక్టు రిక్రూట్ మెంట్ విధానంలో అన్నిరకాల నియామకాలలో ఒక్ శాతం ఉద్యోగాలను ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు కేటాయించాలని ప్రతిపాదించవలసి వచ్చింది.
ఈ మేరకు దరఖాస్తులలో స్త్రీ, పురుష కాలమ్స్ తో పాటు మరొక ట్రాన్స్ జండర్ ల కోసం మరొక కాలం కేటాయిస్తున్నారు.