జిహెచ్ ఎంసిలో రెండు చట్టాల పాలన

(శ్రవణ్ దాసోజు)

తెలంగాణలో రెండు చట్టాల పాలన నడుస్తూ ఉంది.అందునా హైదరాబాద్ నగరంలో మరీ బాహాటంగా ఈ రెండు చట్టాలపాలనను జిహెచ్ ఎంసిఅధికారుల అమలుచేస్తున్నారు

టీఆర్ఎస్ కి ఓ చట్టం.. ప్రజలకో చట్టమా ? చట్టాన్ని అతిక్రమించి నగరం మొత్తం టీఆర్ఎస్ హోర్డింగ్స్ పెడుతుంటే జీహెచ్ఎంసీ ఏం చేస్తుంది?

ఇతర  పార్టీలకు  చెందిన వారెవరైనా ఫ్లెక్స్ కడితే నో హోర్డింగ్ , ఫ్లెక్స్ పాలసీ పేరు చెప్పిన వెంటనే తొలగించేస్తారు. కానీ టీఆర్ఎస్ పార్టీ జోలికి మాత్రం వెళ్లారు. టీఆర్ఎస్ అంటే భయమా ? టీఆర్ఎస్ కి చట్టం అంతచుట్టమా?

తెలంగాణ ఉద్యమంలో సొంత డబ్బులతో ఫ్లెక్స్ లు కట్టి పోరాడిన తెలంగాణ హోర్డింగ్ అసోసియేషన్ నోట్లో మన్ను కొట్టే విధంగా కొత్త హోర్డింగ్ పాలసీ తెచ్చారు. తెలంగాణ హోర్డింగ్ అసోసియేషన్ వారు హోర్డింగ్స్ పెట్టుకోవడానికి వీలు లేదని చెప్పారు. ఆంధ్ర హోర్డింగ్ అసోసియేషన్ వారికి మాత్రం హోర్డింగ్స్ పెట్టుకునే విధంగా వెసులుబాటు కల్పించి వారి దగ్గర కమీషన్లు లాగుతున్నారు. ఇంత దుర్మార్గం ఎందుకు ?

”జూబ్లీ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్, ఫిల్మ్ నగర్, తెలంగాణ భవన్ .. మొత్తం పరిసరాల ప్రాంతంలో ఇష్టం వచ్చినట్లు విచ్చల విడిగా టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లు, జెండాలు, హోర్డింగ్స్ , ఫ్లెక్స్ లు కడుతుంటే జీహెచ్ఎంసీ అధికారులు మొద్దు నిద్రపోతున్నారా ?   కాంగ్రెస్ పార్టీ చెందిన ఎవరైనా ఫ్లెక్స్ కడితే నో హోర్డింగ్ , ఫ్లెక్స్ పాలసీ పేరు చెప్పిన వెంటనే తొలగించేస్తారు. మరి గత రెండు రోజులుగా టీఆర్ఎస్ పార్టీలో ఓ నాయకుడు చేరిక ఉందనే నెపంతో హోర్డింగ్స్ పెడుతుంటే జీహెచ్ఎంసి అధికారులు ఏం చేస్తున్నారు? హోర్డింగ్స్ పెట్టిన వారికి ఫైన్ ఎందుకు వేయడం లేదు ? ఇంత పక్షపాతమా ? టీఆర్ఎస్ కి ఒక చట్టం, మిగతా ప్రజలు మరో చట్టామా ? ఇదే రాజ్యం ?

”కాంగ్రెస్ పార్టీ తరపున మేము ట్వీట్ చేసిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని జీహెచ్ఎంసీ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెబుతున్నారు. మరి ఇంత నిన్నటి వరకూ ఏం చేశారు? టీఆర్ఎస్ కి భయపడుతున్నారా ? చట్టం అందరికీ ఒకేలా వర్తించాలి. అంతేకాని టీఆర్ఎస్ పార్టీకి కొమ్ముకాసినట్లు వ్యవహరిస్తే ఊరుకునేది లేదు.

”తెలంగాణ ఉద్యమంలోప్లెక్సీ పాత్ర కూడాచాలా ఉంది. సొంత డబ్బులతో ఫ్లెక్స్ లు కట్టి ఎందరో ఉద్యమానికి బాసటా నిలబడ్డారు. తెలంగాణ హోర్డింగ్ అసోసియేషన్ ఇందులో ఒకటి. వారి  నోట్లో మన్ను కొట్టే విధంగా కొత్త హోర్డింగ్ పాలసీ తీసుకొచ్చారు. ఒక వైపు కొత్త హోర్డింగ్స్ పెట్టుకోమని చెబుతారు.హోర్డింగ్స్ పెట్టగానే వెంటనే రాత్రిరాత్రికి హోర్డింగ్స్ తీసేసే విధంగా ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో దానిపై ఆదారపడ్డ 20వేల కుటుంబాలని రోడ్డుకీడ్చారు. తెలంగాణ హోర్డింగ్ అసోసియేషన్ వారు హోర్డింగ్స్ పెట్టుకోవడానికి వీలు లేదని చెప్పి ఆంధ్ర హోర్డింగ్ అసోసియేషన్ వారికి మాత్రం హోర్డింగ్స్ పెట్టుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. వారి దగ్గర కమీషన్లు తీసుకుని దందా చేస్తున్నారా? ఇంత దుర్మార్గం ఎందుకు ?

(శ్రవణ్ దాసోజు, ఎఐసిసి అధికార ప్రతినిధి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *