మనం తుఫాన్ ల గురించి విన్నాం, అవి సృష్టించే బీభత్సం గురించి చూస్తున్నాం. ఈ సౌర తుఫాన్ (Solar Storm) ఏమిటి? అది కూడా బీభత్సం సృష్టిస్తుందా? ఎలా? ఈ రోజు సూర్యుడిని వచ్చే సౌరతుఫానొకటి ఈ రోజూ భూమిని తాకనుందని అంతర్జాతీయ వాతావరణ కేంద్రాలు హెచ్చరించాయి.
సౌర తుఫాన్ అనేది సూర్యుని నుంచి భూమ్మీదికి వీస్తున్న శక్తి వంతమయిన ఎలెక్ట్రో మాగ్నెటిక్ కిరణాల గాడ్పు. సూర్యుడి నుంచి వెలవడిన ఈ కిరణాలు అత్యంత వేగంగా భూమి వైపు వస్తున్నాయి. ఈ రోజు రేపు వీటి ప్రభావం భూ ధృవాల మధ్య ఆరోరా (Aurora)ల రూపంలో కనిపిస్తుంది. ఆరోరా అంటే ఆకాశంలో కనిపించే అద్భుతమయిన లైట్ షో. ఇవి ఉత్తర ధృవం దగ్గిర (Aurora borealis), దక్షిణ ధృవం దగ్గిర (Aurora australis) బాగాకనిపిస్తాయి.
భూమి వాతావరణ పొరకు రంద్రాలు పడినట్లు సూర్యడి వాతావరణ పొరకు కూడా రంద్రాలు పడుతుంటాయి. అపుడు సూర్యుడి మీద మండుతున్న వాయువుల అగ్నీ కీలలు ఈ రంద్రాల గుండా తప్పించుకుని బయటకు వస్తాయి. ఈ మంటల గాడ్పులే సౌరతుఫాన్.
ఈ సోలార్ తుఫాన్ వల్ల భూమ్మీద జియోమాగ్నెటిక్ తుఫాన్ వచ్చే వీలుంది. జియో మాగ్నటిక్ తుఫాన్ అంటే సౌర తుఫాన్ వల్ల భూవాతావరణంలో జరిగే అలజడే.
దీని వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఎదురయ్యే ప్రమాదం ఉంది.ఫలితంగా పవర్ ఫెయిల్యూర్ జరగవచ్చు. ఈ సారి సూర్యుడి భూమధ్య రేఖ మీద వాతావరణంలో రంద్రం ఏర్పడింది. దాన్నుంచి సెకన్ కు 500 కి.మీ వేగంగా సౌరగాలి వీస్తూవుంది. ఇది ఇంకా పెరగవచ్చు. “Flowing from an equatorial hole in the sun’s atmosphere,wind spees could to 500 km/s . Full-fledged geometric storms are unlikely, but lesser geometric unrest could spark high altitude auroras,” అని spaceweather.com రాసింది
ఇలాంటి సోలార్ తుఫాన్ ప్రభావం ఒక్కొక్క సారి చాలా తీవ్రంగా ఉంటుందని Space Weather Prediction Centre హెచ్చరించింది.
ఒక్కొక్క తీవ్ర ప్రభావం ఉంటుంది ఇలా
సూర్యుడి నుంచి వెలవడే రేడియేషన్ లో పార్టికిల్స్ ఉంటాయి. ఇందులోని శక్తివంతమయిన ప్రొటాన్ అనే పార్టికల్స్ ఉపగ్రహాలను గాని, మనుషులను గాని తాకితే, అవిలోనికి చొచ్చుకునిపోతాయి. ఎలెక్ట్రానిక్ పరికరాల్లోనయిన సర్యూట్లను దెబ్బతీస్తాయి. మనుషుల్లోనయితే డిఎన్ ఎ కు హాని చేస్తాయి.
“Solar Radiation Storms cause several impacts near Earth. When energetic protons collide with satellites or humans in space, they can penetrate deep into the object that they collide with and cause damage to electronic circuits or biological DNA. During the more extreme Solar Radiation Storms, passengers and crew in high flying aircraft at high latitudes may be exposed to radiation risk. Also, when the energetic protons collide with the atmosphere, they ionize the atoms and molecules thus creating free electrons. These electrons create a layer near the bottom of the ionosphere that can absorb High Frequency (HF) radio waves making radio communication difficult or impossible.” అని Space Weather Prediction Centre పేర్కొంది.
ఈ రోజు ఏమవుతుందో చూద్దాం.