ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు ఆషాఢ మాస తొలి సారెను దేవస్థానం తరపున వైదిక కమిటీ, దేవస్థానం ఉద్యోగులు ఆదివారం సమర్పిస్తారు. ఉదయాన స్థానాచార్య శివప్రసాదశర్మ ఆధ్వర్యంలో అర్చక సిబ్బంది. అమ్మవారికి తొలి సారెను సమర్పిస్తారు.
ఈ నెల 11 నుంచి ఆగస్టు 8 వరకు ఆషాఢ సారెను సమర్పించే భక్తులు, ధార్మిక సంస్థలు మూడు రోజులు మందుగా దేవస్థానం అధికారులకు తెలియజేయాలి.
ఆఫీసు వేళల్లో దేవస్థానం ఫోను నెంబర్లు 9493545253, 8341547300లకు ఫోను చేసి ఎక్కడి నుంచి సారెను తీసుకువస్తున్నది. భక్తుల సంఖ్య , ఏ తేదిన సమర్పించేది తదితర వివరాలను ముందుగా నముదు చేసుకోవాలి. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించి దేవస్థానం అధికారులకు సహకరించాలి.