జూలై నెల 10 నుండి 17వ తేది వరకు కొత్త పిసిసి అధ్యక్షేడుే రేవంత్ రెడ్డి పాదయాత్ర జరపనున్నారు. నిన్న నే ఆయన తెలంగాణ పిసిసి అధ్యక్షుతడిగా బాధ్యతలు స్వీకరించారు. భారీగా అభిమానులు తరలి రావడంతో ఈ కార్యక్రమం బాగా విజయవంతమయింది. దీనితో పార్టీలో కొత్త ఉత్సాహం మొదలయింది. అందుకే ఇదే వేడిలో పాదయాత్ర కూడా ప్రారంభించేందుకు ఆయన నిర్ణయించారు.
నిరుద్యోగ సమస్యను హైలైట్ చేసేందుకు ఈ వారం రోజుల పాదయాత్ర చేపడుతున్నారు.
యాదగిరి గుట్ట శ్రీలక్ష్మి నరసింహ స్వామి దర్శనం చేసుకొని
ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేపడతారు.
ఇదే విధంగా 17వ తేది శ్రీకాంతా చారి విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలిసింది.