మంగళవారం నాడు హైదరాబాద్ బాలానగర్ లో నిర్మించిన ఫ్లైవోవర్ ను మునిసిపల్, ఐటి శాఖల మంత్రి కేటీ రామారావు ప్రారంభిస్తున్నారు. ఈ ప్లైవోవర్ కు బాబూ జగ్జీవన్ రామ్ పేరు పెట్టారు. ఈ ఫ్లైవోవర్ ను రు. 387 కోట్లతో నిర్మించారు. దీని పొడవు 1.13 కిలోమీటర్లు. వామనాల రాకపోకల కోసం ఫ్లైవోర్ మీద ఆరులేన్ లుంటాయి. హైదరాబాద్ లో ఆరులైన్లతో నిర్మించిన తొలి ఫ్లైవోవర్ ఇదే. 24 మీటర్ల వెడల్పు, 26 పిల్లర్లతో బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయింది.
ఇది బాలానగర్ క్రాస్ రోడ్, నర్సాపూర్ క్రాస్ రోడ్ల మధ్య ఈ ఫ్లైవోవర్ నిర్మించారు. ఈ ఫ్లైవోవర్ నిర్మాణంతో ఈ ప్రాంతంలో చాలా కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ నరకం నుంచి బయపడతారు. ఈ ప్రాంతంలో 2050 సంవత్సరం దాకా ట్రాఫిక్ పెరుగుదల ను దృష్టిలో పెట్టుకుని ఈ వంతెన డిజైన్ చేశారు.
2017 ఆగస్టు 21న ఈ ఫ్లైవోవర్ కు శంకు స్థాపన చేశారు. దీనికి పునాది రాయి వేసింది కూడా కెటిఆరే…
Laid the foundation for much awaited Balanagar Flyover with an estimated cost of Rs. 387 crores & addressed a well attended public meeting pic.twitter.com/YOya4BUMRi
— KTR (@KTRTRS) August 21, 2017