తెలంగాణలో బాగా పెరగనున్న భూముల ధరలు

తెలంగాణలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచాలని  రిసోర్స్ మొబిలైజేషన్ మీద ఏర్పాటుచేసిన క్యాబినట్ సబ్ కమిటీ సిఫార్సు చేసిందో లేదో హైదరాబాద్ లో ప్రాపర్టీ ధరలకు రెక్కలు రాబోతున్నాయి. దీనికి తగ్గట్టుగా  రిజస్ట్రేషన్ డిపార్టుమెంటు  భూముల రిజిస్ట్రేషన్ వ్యాల్యూని  20 శాతం నుంచి 200 శాతం పెంచాలని యోచిస్తున్నది. ఈ విలువ పెరిగితే భూముల ధరలు కూడా భారీగానే పెరుగుతాయి.

క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సును  ముఖ్యమంత్రి కెసిఆర్ అమోదిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం లో అనూహ్యమయిన మార్పులు రానున్నాయి. నిధులు కొరత ఎదుర్కొంటున్న ప్రభుత్వాన్ని అదుకునేందుకు ముఖ్యమంత్రి క్యాబినెట్ ప్రతిపాదలను తప్పక ఆమోదిస్తారని,  ఆగస్టు ఒకటి లోపు ఆయన ఆమెదముద్ర పడుతుందని చాలా మంది భావిస్తున్నారు.

రెసిడెన్సియల్ ప్రాంతాలలో  రిజిస్ట్రేషన్ ధరలు నూటికి నూరు శాతం పెరిగే అవకాశం ఉంది. కమర్షియల్  ప్రాపర్టీస్ కు సంబంధించి 200  శాతం దాక పెరగవచ్చు. ఇక గ్రామీణప్రాంతాలలో, మునిసిపాలిటీలలో  20 శాతం నుంచి 50 శాతం దాకా రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగవచ్చని అధికార వర్గాలను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.

ఇక హెచ్ ఎమ్ డిఎ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ పెంపు 100 శాతం నుంచి 200శాతం దాకా ఉండవచ్చని భావిస్తున్నారు.ఉదాహరణకు మాధాపూర్,  గుట్టల బేగంపేట్, ఖానామెట్, సేరిలింగం పల్లె లలో ప్రభుత్వం నిర్ణయించిన రిజస్ట్రేషన్ వ్యాల్యూ కమర్షియర్ ఏరియాలలో చదరపు అడుగుకు  రు.30,000 రెసిడెన్షియల్ ఏరియాలో    రు. 20 వేల దాకా ఉంటుంది. ఈ రేటు ప్రకారం ప్రజలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తారు. నిజానికి ఈ ప్రాతంలో భూమి విలువ  చదరపు అడుగు లక్షరుపాలయ దాకా ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు, మార్కెట్ రేటు కు చాలా వ్యత్యాసం ఉన్నందున, ప్రభుత్వ రేటును రెండింతలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్ లో మెట్రో సౌకర్యం రావడంతో సూదర ప్రాంతాలలో కూడా భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అయితే, దీనికి తగ్గట్టుగా రిజిస్ట్రేషన్ ధరలు పెరగలేదు. రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీని  ఇపుడున్న ఆరు శాతం నుంచి 7 శాతం నుంచి 7.5 శాతం దాక పెంచాలని రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ భావిస్తూ ఉందది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *