ఈ ఫోటో కొన్నాళ్ల కిందట చాలా వివాదాన్ని సృష్టించింది. ఇపుడు మళ్లీ ప్రత్యక్షమయి సరికొత్త వివాదం సృష్టిస్తూ ఉంది.
ఈ ఫోటోలో ఒక నాటి ప్రధాని, ఒక సారి ఎద్దుల బండిమీద పార్లమెంటుకు వచ్చారు. దీనిని రాజీవ్ త్యాగి అనే వ్యక్తి పేస్ బుక్ లో పోస్టు చేశారు.
రాజకీయాల్లో ఇలాంటివి అపుడపుడూ జరుగుతుంటాయి. వాజ్ పేయి పార్లమెంటుకు ఎద్దులో బండి మీద ఎందుకువచ్చారు? త్యాగి వివరణ ప్రకారం, రాజీవ్ గాంధీ ప్రధానిగా భారత్ కంప్యూటర్ల యుగం ఆవిష్కరిస్తున్నందుకు నిరసన చెప్పేందుకు వాజ్ పేయి ఇలా ఎద్దుల బండి మీద పార్లమెంటుకు వచ్చారు.
త్యాగి వివరణ తప్పు అని ఇండియా టుడే రాసింది. ఇండియా టుడే కు చెందిన Anti Fake News War Room (AFWA)దీనిని వెరిఫై చెేసి రాజీవ్ గాంధీ కంప్యూటర్ యుగానికి వ్యతిరేకంగా వాజ్ పేయి చేసిన నిరసన కాదని తెేల్చింది.
ఇది 1973 నాటిదని, అపుడు పెట్రోలు, కిరొసిన్ ధరలు పెరిగినందుకు నిరసన వాజ్ పేయి ఎద్దుల బండెక్కి పార్లమెంటుకు వచ్చారని రాసింది. అపుడు పెట్రోలు కిరొసిన్ ధరలు బాగా పెరిగాయి. అపుడు ఈ ధరలు పెంచింది ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం. దీనికి అది అంతర్జాతీయ సంక్షోభ సమయం.
ఇపుడు మళ్లీ వాజ్ పేయి ఎద్దుల బండి కథ ప్రత్యక్షమయింది. ఈ సారి ఫోటో కాకుండా ఏకంగా వీడియోయే ప్రత్యక్షమయింది. ఈ అరుదైన వీడియోని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ ట్వీట్ చేశారు.
Rare footage from 1973 of an opposition protest when petrol prices were raised by seven Paise. Atal Bihari Vajpayee arrived in Parliament on a bullock cart (which would not be possible today with the new security restrictions on vehicle entry into the complex! అని ఆయన రాశారు.
ఇపుడు పెట్రోల ధరలు రోజూ ఎలా పెరుగుతున్నాయో తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులతోపాటు అనే ప్రాంతాలు పెట్రోలు ధర లీటర్ రు.100 దాటింది.అది రు.150 వైపు పరిగెడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు గొడవచేస్తున్నాయి. ఉద్యమాలు చేస్తున్నాయి. బిజెపి మోదీ ప్రభుత్వం తన కేమీ పట్టనుట్లుంది. ఉద్యమాలు చేయడమే పని అన్నట్లు ప్రతిపక్షాలను నిందిస్తూ ఉంది. పెట్రోలు ధరలు పెరిగినపుడు వాజ్ పేయి వంటి నేతలు ఎలా స్పందించారో చెప్పటానికి శశిథరూర్ ఈ అరుదైన వీడియోని ట్వీట్ చేసి ఉంటారు.
Rare footage from 1973 of an opposition protest when petrol prices were raised by seven Paise. Atal Bihari Vajpayee arrived in Parliament on a bullock cart (which would not be possible today with the new security restrictions on vehicle entry into the complex!) pic.twitter.com/1hd97kgoMG
— Shashi Tharoor (@ShashiTharoor) July 3, 2021
వాజ్ పేయి ఎద్దుల బండెక్కి పార్లెమెంటుకు వచ్చే రోజున ప్రపంచంలో ఆయిల్ సంక్షోభం చెలరేగుతూ ఉంది. అంతర్జాతీయ ఉద్రిక్తత పెరుగుతూ ఉంది. ఈ విషయం మీద ప్రజలను చైతన్యం వంతం చేసేందుకు ప్రధాని ఇందిరాగాంధీ, వాజ్ పేయి ప్రదర్శనకు ఒక రోజు ముందు గుర్రపు బండి ఎక్కి ఢిల్లీ కాలనీల్లో తిరిగి ఇంధనం పొదుపుగా వాడండి అని ప్రచారం చేశారు. ఆమె గుర్రపు బండిలోనే కార్యాలయానికి వచ్చారు.
1973లో ఆయిల్ సంక్షోభం ఎందుకొచ్చిందంటే అమెరికా, ఇంగ్లండ్, జపాన్ , నెదర్లాండ్స్, కెనడా దేశాలుఇజ్రేల్ సహకరిస్తున్నందున ఆర్గనైజేషన్ ఆఫ్ అరబ్ పెట్రోలియ్ ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్ 1973 అక్టోబర్ లో అయిల్ ఉత్పత్తిని నిలిపివేసింది. దీనితో ప్రపంచమంతా అయిల్ సంక్షోభం మొదలయింది. ఆయిల్ ధరలు 300 శాతం పెరిగాయి. మూడు డాలర్ల క్రూడ్ ఆయిల్ ధర 12 డాలర్లయింది. 1974 మార్చి దాకా ఈ సంక్షోభం కొనసాగింది. ఇండియాలో అపుడు ధరలు పెరగేందుకు ఈ అరబ్ దేశాల ఆగ్రహమే కారణం.
పెట్రోల్, కిరోసిన్ వంటి ఇంధనం ధరలు పెరగడంతో ఇండియా ఆహారోత్పత్తి పడిపోయేలా చేసింది. దేశంలో కిరోసిన్ రేషనింగ్ మొదలయింది.భారతదేశం ఎగమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 50 నుంచి80 శాతం దాకా ఆయిల్ దిగుమతులకు పోతున్నది. అనేక మంది వ్యాపారస్థులు, ప్రభుత్వోద్యోగులు బస్సులలో ప్రయాణించడం మొదలు పెట్టారని న్యూయార్క్ టైమ్స్ రాసింది. డిమాండ్ పెరగడంతో రిక్షా ప్రయాణం ధరలు కూడా పెరిగాయి. భారతదేశంలో 24.5 మిలియన్ టన్నుల పెట్రోలియం, పెట్రోఉత్పత్తులను వినియోగిస్తూ ఉండింది.