తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కోసం చివరి దాకా ప్రయత్నించి విఫలమయిన కాంగ్రెస్ నేతల్లో నల్గొండ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరు. టిపిసిసి చీఫ్ గా అధిష్టానం మల్కాజ్ గిరి ఎంపి ఎ రేవంత్ రెడ్డి పేరు ప్రకటించాక ఆయన నిరాశగా వెనుదిరిగి వచ్చారు. పిసిసి చీఫ్ పోస్టు కోసం ఆయన ఎంత తీవ్రంగా ప్రయత్నించారో, అంతే తీవ్రంగా ఆయనకు ఇవ్వకూడదని ప్రత్యర్థి వర్గం ప్రయత్నించింది. ఈ పరుగు పందెంలో కోమటిరెడ్డి ఓడిపోయారు. హైదరాబాద్ తిరిగొచ్చారు.
డిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త కార్యవర్గాన్ని అభినందిస్తూనే మెలిక వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ నేతృత్వంలోని కొత్త కార్యవర్గం తన సత్తాను హుజూరాబాద్ ఎన్నికల్లో నిరూపించుకోవాలని అంటూనే కొత్త నాయకత్వం రాబోయో హుజుర్ నగర్ న్నికల్లో పార్టీకి కనీసం డిపాజిట్లు తెప్పించాలని అన్నారు.
ఓటుకు నోటు కేసు మాదిరిగానే పిసిసి ఎన్నిక జరిగినట్టు తనకు డిల్లీ వెళ్లాక తెలిసిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.
‘నన్ను కలిసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిసింది నూతన అధ్యక్షునితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా నన్ను కలిసేందుకు ప్రయత్నం చేయకూడదు. హూజురాబాద్ లో జరగబోయే ఉప ఎన్నికల్లో కొత్త కార్యవర్గం కనీసం డిపాజిట్లైనా తెచ్చుకోవాలి.
“కాంగ్రెస్ పార్టీ కూడా టిటిడిపి మాదిరిగానే మారబోతుంది. టి పిసిసిలో కార్యకర్తలను గుర్తింపులేదు. పార్టీని నమ్ముకున్న వెంకట్ రెడ్డి కి అన్యాయం జరిగింది. ఇక మనకు కూడా అదే పరిస్థితి జరుగుతుందని కార్యకర్తలు అనుకుంటారు. రేపటి నుండి ఇబ్రహీం పట్నం నుండి భువనగిరి వరకు పాదయాత్ర చేస్తా. ప్రజల మధ్యనే ఉంటా కొత్త నాయకులను కొత్త కార్యకర్తలను ప్రోత్సహిస్తా. నల్గోండ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల గెలుపుకోసం కృషి చేస్తా. పొర్లమెంట్ లో నాగళం వినిపిస్తా. గట్కరిగారు స్వయంగా చెప్పారు ఎల్బినగర్ నుండి ఆందోళ్ మైసమ్మ వరకు జాతియ రహదారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తేనే మంజురు చేశారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గట్కరీ స్వయంగా చెప్పారు. పార్లమెంటులో నియోజకవర్గంలో నాగార్జునసాగర్ కు 370 కోట్లతో పనులు జరుగుతున్నాయి