హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో నెక్లెస్ రోడ్డు వద్ద పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీన పీవీ జయంతి సందర్భంగా సీఎం కెసిఆర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఖ్యాతిని జాతికి చాటిచెప్పేలా తెలంగాణ సర్కారు శతజయంతి ఉత్సవాలు జరుపుతున్న సంగతి తెలిసిందే.
26 అడుగుల ఎత్తు, 2 టన్నుల బరువు ఉన్న ఈ విగ్రహాన్నితయారు చేసేందుకు రూ.27 లక్షల ఖర్చయింది. విగ్రహం తయారీలో పలు లోహాలను ఉపయోగించారు. అదే రోజున అధికారికంగా నెక్లెస్ రోడ్డు పివి నరసింహారావు మార్గ్ గా మారుతుంది.
పీవీ విగ్రహం నెలకొల్పుతున్న ప్రాంతం చుట్టూ అర ఎకరం మేర అందమైన తోటగా ముస్తాబు చేయనున్నారు.