అమరావతి: ఈ రోజు పోలవరం ప్రాజెక్టు వద్ద స్పిల్ వే మీదుగా గోదావరి నీటిని అప్రోచ్ కెనాల్ కు మళ్ళించారు. ఎర్త్ కం రాక్ ఫీల్ డ్యామ్ నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని విడుదల చేశారు.
ఈ నీరు స్పిల్ వే, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చేరి, అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టా కు సరఫరా అవుతుంది.
ఈ సీజన్ లో కురిసే భారీ వర్షాల వల్ల వరద నీటిని మళ్లించడానికి అనుగుణంగా ఈ ఏర్పాటు చేశారు. మొత్తంగా 6.6 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహం మళ్లించారు.