“జిందగీ బడీ హోనీ చాహియే.. లంబీ నై”

బతికున్నప్పుడే జీవించాలి!

 

(సిఎస్ సలీమ్ బాషా)

చాలా చిత్రమైన మాట అది. బతికే ఉన్నాం కదా మళ్లీ జీవించడం ఏంటి? బతకడం అంటే జీవించడం కాదా? అని అనిపిస్తుంది చాలామందికి. ఖచ్చితంగా బతకడం వేరు జీవించడం వేరు. బతకడం అంటే ఉండటం.. జీవించడం అంటే బతికి ఉండడాన్ని ప్రతిరోజు, ప్రతిక్షణం ఆస్వాదించడం. జీవించటం అంటే నిత్య చలనం. బతకటం అంటే కేవలం ఉండటం. శాస్తీయంగా చెప్పలంటే మొదటిది Kinetic రెండోది Static. తమాషా ఏంటంటే రెండింటిలోనూ Energy (శక్తి) ఉంటుంది. తాత్విక పరిభాషలో చెప్పాలంటే జీవించడం ఆశావాదం. బతకడం నిరాశావాదం.

ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం అంటే ఒక జీవితాన్ని గురించి తెలుసుకోవడం. ఇంగ్లీష్ లో కూడా కొంతమంది దీన్ని “LIVE WHEN YOU ARE ALIVE” అని చెప్పుకుంటారు. ఇక హిందీలో అయితే ఆనంద్ సినిమాలో రాజేష్ కన్నా పాత్ర చెప్పిన “జిందగీ బడీ హోనీ చాహియే.. లంబీ నై” అన్నది జీవించడం గురించి గొప్పగా నిర్వచించిన గొప్ప వాక్యం. దాన్ని తెలుగులోకి అనువదించడం కంటే అర్థం చేసుకోవడం ముఖ్యం. ” జీవితం పొడుగ్గా ఉండకూడదు, విశాలంగా ఉండాలి” అనేది దాన్ని నిర్దిష్ట అనువాదం. దాని ఆత్మను అర్థం చేసుకోవాలంటే. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. కొంచెం విస్తృతంగా చెప్పాలంటే, “It is not the years in your life that count, but how much life was there in those years definitely counts!” ఎవరు చెప్పారో కానీ, చాలా బాగా చెప్పారు

ఇక్కడ చాలా మందికి వెంటనే అనిపిస్తుంది. కరోనా నుంచి తప్పించుకొని బతికితే చాలు.. జీవించడం మాట దేవుడెరుగు, అని. ఇది కూడా నిజమే. ఇంత పెద్ద ఉపద్రవం వచ్చి పడింది. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎంత టెన్షన్ ఉంది.. అలాంటప్పుడు జీవితాన్ని ఎలా ఆస్వాదించగలము? నిజమే! దానివల్ల వచ్చే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అన్ని విషయాల్లో పాజిటివ్ గా ఉండే మనుషులు కరోనా పాజిటివ్ అనగానే నెగిటివ్ అయిపోతారు. అలా కావడం సహజమే. ఎందుకంటే చెప్పటం సులువు. కరోనా వస్తే తెలుస్తుంది. అని కూడా అనుకోవచ్చు.

అయితే కొంచెం స్థిమితంగా ఆలోచిస్తే. కరోనా ఒక్కరికే రాలేదు. చాలా మందికి వచ్చింది. మనకు కూడా వచ్చింది అనుకోవచ్చు కదా. అలా అనుకోరు చాలామంది. ఈ విషయంలో కొంత తాత్వికత అవసరం. అందరితోపాటు మనకూ వచ్చింది. అందరికీ పోయినట్లే మనకు పోతుంది. అనుకోవడం ముఖ్యం. ఇప్పుడు శాస్త్ర ప్రపంచం, డాక్టర్లు, మానసిక శాస్త్రవేత్తలు, సాంఘిక కార్యకర్తలు, పెద్దవాళ్లు అందరూ చెప్పే మాట ఒక్కటే.

కరోనా వచ్చిందని కంగారుపడి పోయినా, భయపడి బతికినా కరోనా ను జయించడం కష్టం. కరోనా పాజిటివ్ ను కూడా పాజిటివ్ గా తీసుకొని జీవిస్తే నెగిటివ్ కావడానికి మార్గం సులభం అవుతుంది. ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరు చెబుతున్నారు. పేపర్లలో తరచూ వార్తలు వస్తున్నాయి. ధైర్యంగా ఉన్న వాళ్లు(జీవిస్తున్న వాళ్లు) వయసుతో సంబంధం లేకుండా కరోనా ను జయించారు అని. జీవించడం అన్నది చాలా సులువైన విషయం, బ్రతకడమే కష్టం. వినడానికి విచిత్రంగా అనిపించినా ఇది నూటికి నూరుపాళ్ళు నిజం. బతకడం అంటే ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచిస్తూ, జీవితాన్ని ఈడుస్తూ ఉండడం.

జీవించడం అంటే కొంచం కష్టం, కొంచం సుఖం, కొంచం దుఃఖం, చీకటి, మరి కాసింత వెలుగు, కొంచం తీపి, కొంచం కారం, కొంచం చేదు, కొంచం వగరు, కొంచం ఉప్పు, కాసింత పులుపు కాసింత నెగటివ్, ఎక్కువ పాజిటివ్ లు ఉంటాయన్న నిజాన్ని జీర్ణించుకోవడం. ఈ ఒక్క మానసిక తత్వమే జీవించడం అంటే.

“నువ్వు జీవించి ఉన్నందుకు సంబరాలు చేసుకో” అంటాడు Christin Bernard అనే రచయిత తాను రాసిన “In celebration of being alive” అనే కథలో. Hospital లో ఇద్దరు పిల్లలు ఒక రోజు ఉదయం “జీవించడం” గురించి తనకు స్పష్టంగా తెలియపరిచారు అని ఆయన చెప్పుకున్నాడు.

క్లుప్తంగా ఈ కథ గురించి చెప్పాలంటే

డాక్టర్ ఒకరోజు ఉదయం హాస్పిటల్లో చూసిన సంఘటన, అతని ఎంతగా మార్చేసింది అన్నది. ఇద్దరు పిల్లలు ఒక trolley ని నడుపుతూ ఎంజాయ్ చేయడం. అందులో ఒక పిల్లవాడు యాక్సిడెంట్లో కళ్ళు పోగొట్టుకున్నవాడు. ఇంకొకటి వాడు గుండెలో ఉన్న hole కి ఆపరేషన్ చేయించుకున్న వాడు, పైగా ఒక చెయ్యి లేనివాడు. నర్స్ వచ్చి ఆపేంతవరకు వాళ్ళిద్దరూ trolley నడుపుతూ ఎంజాయ్ చేశారు. ఇది చూసిన డాక్టర్ తనకు ఆ పిల్లలిద్దరూ ఒక విషయాన్ని చక్కగా నేర్పించారు అని చెప్పడం ఈ కథ యొక్క ఉద్దేశం. ( పాఠకుల సౌలభ్యం కోసం ఆ కథ లోని కొంత భాగాన్ని యథాతథం గా కింద ఇస్తున్నాను).

One morning, several years ago, I witnessed what I call the Grand Prix of Cape Town’s Red Cross Children’s Hospital. It opened my eyes to the fact that I was missing something in all my thinking about suffering – something basic that was full of solace for me.
What happened there that morning was that a nurse had left a breakfast trolley unattended. And very soon this trolley was commandeered by an intrepid crew of two – a driver and a mechanic. The mechanic provided motor power by galloping along behind the trolley with his head down, while the driver, seated on the mower deck, held on with one hand and steered by scraping his foot on the floor. The choice of roles was easy because the mechanic was totally blind and the driver had only one arm.
They put on quite a show that day. Judging by the laughter and shouts of encouragement from the rest of the patients, it was much better entertainment than anything anyone puts on at the Indianapolis 500 car race. There was a grand finale of scattered plates and silverware before the nurse and ward sister caught up with them, scolded them, and put them back to bed.
Suddenly, I realized that these two children had given me a profound lesson in getting on with the business of living. Because the business of living is joy in the real sense of the word, not just something for pleasure, amusement, recreation. The business of living is the celebration of being alive.
I had been looking at suffering from the wrong end. You don’t become a better person because you are suffering, but you become a better person because you have experienced suffering. We can’t appreciate the light if we haven’t known darkness. Nor can we appreciate warmth if we have never suffered cold. These children showed me that it’s not what you’ve lost that’s important. What is important is what you have left.

చాలామంది ఇది తమకు లేని దాని గురించి, తాము పోగొట్టుకున్న దాని గురించి ఆలోచిస్తుంటారు తప్ప , తమకు ఉన్న దాని గురించి పట్టించుకోరు అన్న విషయం కూడా ఆ పిల్లలు అర్థమయ్యేలా తనకు చెప్పారని ఆయన చెప్పుకొచ్చాడు.

ఒకసారి వివేకానందుడు రామకృష్ణ పరమహంస ను ” మీకు మనుషుల్లో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి?” అని అడిగాడు. దానికి ఆయన నవ్వి” సుఖం వచ్చినప్పుడు నాకే ఎందుకు స్వామి అని దేవుడిని అడగని మనుషులు, కష్టం వచ్చినప్పుడు మాత్రం నాకే ఎందుకు స్వామి అని దేవుణ్ణి అడగడం” అన్నాడు

జీవించడం అంటే వర్తమానంలో ఉండడం. అంటే ఈ క్షణం, ఈరోజు గురించి ఆలోచించడం. బతకడం అంటే గతం తవ్వుకుని దుఃఖించడం, భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకోవడం. జీవించడానికి పాజిటివ్ థింకింగ్ కి అవినాభావ సంబంధం ఉంది. దీనికి ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. జీవించడం అంటే practical thinking కూడా. అంటే కామన్సెన్స్ అన్నమాట.

ఇప్పుడు కరోనా విషయమే తీసుకుంటే చాలామంది ఆందోళన చెందుతున్నారు, భయపడుతున్నారు. కొంచెం స్థిమితంగా ఆలోచిస్తే ఆందోళన, భయం తగ్గుతాయి. ఇప్పటివరకు ఎంత మంది కరోనా బారిన పడ్డారు , ఎంత మంది చనిపోయారు, ఎంతమంది స్వస్థత చేకూరి ఇంటికి వెళ్ళిపోయారు. అన్న విషయం చూసుకుంటే మనకు అర్థం అవుతుంది. కొన్ని కోట్ల మంది కరోనా బారినపడకుండా ఆరోగ్యంగా ఉన్నారు. కరోనా వ్యాక్సిన్ కూడా ఉంది. కరోనా లక్షణాలకు మందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు. అవి మాత్రమే ఆలోచించాలి. ఇంకో విషయం ఏంటంటే మన చేతుల్లో ఏముంది అన్నది. జాగ్రత్తలు పాటించడం, మాస్క్ పెట్టుకోవడం, అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు వెళ్లడం, తరచూ చేతులు కడుక్కోవడం మన చేతుల్లో ఉన్న విషయాలు. అవి చేస్తే చాలు. మన పరిధిలో లేని విషయాలు, మనం చేయలేని విషయాలు ఆలోచించి భయాందోళనకు గురి కావడం జీవించడం కాదు, క్షణక్షణం భయపడుతూ బతకడం. ఈ ఆందోళనకరమైన పరిస్థితుల్లో అన్ని పాజిటివ్ అంశాల గురించే మనం ఆలోచించాలి, వాటినే పట్టించుకోవాలి. మిగతా విషయాల గురించి పట్టించుకోకూడదు.వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలలో వస్తున్న ప్రతి విషయాన్ని చదవటం కంగారుపడి పోవడం, అన్నింటిని మనకు అన్వయించుకోవడం వంటివి చేయకూడదు.

Like this story!, Share it with friends.

ఉదయం నిద్ర లేచాము అంటేనే, ఆనంద పడాలి. టిఫిన్ తిన్నాము అంటే ఇంకా ఎక్కువ ఆనంద పడాలి, అలాగే మధ్యాహ్నం భోజనం, మళ్లీ టీ కాఫీలు మనకు దొరుకుతున్నాయి అంటే దానికి ఆనంద పడాలి. ఇలా చిన్న చిన్న విషయాలను కూడా ఆస్వాదిస్తూ మనం చేయగలిగే, చేయవలసిన పనులు మాత్రమే చేస్తూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించడమే జీవించడం అంటే.
జీవించడం అంటే ఈ క్షణంలో ఉండడం, ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం. మన పరిధిలో లేని అంశాల గురించి అసలు పట్టించుకోకుండా ఉండడం. ఇలా ఉండాలంటే చేసే ప్రతి పనిని ఎంజాయ్ చేయడం. చిన్న ఉదాహరణ చూద్దాం. చాలామంది ఉదయాన్నే టీ తాగుతూ వార్తలు చూస్తూ ఉంటారు. అవి కూడా కరోనా కు సంబంధించిన వార్తలు. అది అవసరమా? చూడటమే కాకుండా దాన్ని వేరే వాళ్ళకి చేరవేస్తూ ఉంటారు. ఎంత టైం వేస్ట్. కేవలం భయం ఆందోళన పెరగడానికి మాత్రమే పనికి వచ్చే పని అది. ప్రశాంతంగా ఉండాలంటే మన పని మాత్రమే మనం చేయాలి, ఇతరుల పని మనం చేయకూడదు. చేస్తున్న పనిని శ్రద్ధగా చేస్తూ ఆస్వాదించాలి కూడా. ఇదే జీవితం అంటే, జీవించడం అంటే.

చివరగా చెప్పాలంటే ఈ కరోనా సమయంలో భయపడి బతికితే జీవించడం కష్టం, జీవిస్తూ బతికితే బతకడం సులభం . అందుకే బతికున్నప్పుడే జీవించాలి!

(సలీమ్ బాషా, లాఫ్ థెరపిస్టు, రచయిత, హోమియో వైద్యుడు. కర్నూలు. ఫోన్ నెం.9393737937)

 ఇది కూడా సలీమ్ రాసిందే.  చదవండి, మీకు నచ్చుతుంది

https://trendingtelugunews.com/entertainment/anand-hindi-movie-zindagi-badi-honi-chahiye-lambi-nahi/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *