ఆంధ్రకు మూడు రోజుల వాతావరణ సూచన

ఈరోజు (03.06.2021) నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం లోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతము, దక్షిణ కేరళ, దక్షిణ తమిళనాడు, కొమరిన్-మాల్దీవులు ప్రాంతములోని అన్ని ప్రదేశాలలో మరియు నైరుతి బంగాళాఖాతంలో లోని మరికొన్ని ప్రాంతాలలో ప్రవేశించాయి.

రాగల 2 రోజులలో నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కేరళ & లక్షద్వీప్ లలోని మిగిలిన ప్రాంతాలు, తమిళనాడు & పుదుచ్చేరి లలోని మరికొన్ని ప్రాంతాలు, కోస్తా మరియు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమలలోని కొన్ని ప్రాంతాలు మరియు దక్షిణ & మధ్య బంగాళాఖాతములలోని కొన్ని ప్రాంతాలలో విస్తరించే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ కు మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :

ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :

ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:

ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం,  సంచాలకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *