మీడియాపై కేసీఆర్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని యూనియన్ ఆఫ్ తెలంగాణ జర్నలిస్ట్స్ రాష్ట్ర కమిటి కోరింది. ప్రజ సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్ట్ రఘుపై నిర్భందం మోపడాన్ని తీవ్రంగా టియుజె ఖండిస్తున్నది. జర్నలిస్ట్ రఘును వెంటనే విడుదల చేయాలని టియుజె కమిటి రాష్ట్ర నాయకులు సంపత్ కుమార్, విద్యా వెంకట్ లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
టియుజె ప్రకటన వివరాలు:
ఉదయం రఘు కిడ్నాప్ చేసి, ఫోన్ స్విచ్చాఫ్ చేయిండం,
నెంబర్ ప్లేట్ లేని వాహనంలో వచ్చి ముసుగు వేసి బలవంతంగా దుండగులు లాక్కెల్లిన తీరు హేయమైన చర్యగా భావిస్తున్నాం. రఘు
ఆచుకీ కోసం కుటుంభ సభ్యులతో పాటు తోటి జర్నలిస్టులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి.
పోలీసులే ఎత్తుకెల్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నాం.
ఇప్పటికీ అరెస్టును పోలీసులు ద్రువీకరించక పోవడం, పలు అనుమానాలకు తావిస్తోంది.
గుర్రం పోడు గిరిజన భూముల అధికార పార్టీ ఆక్రమణపై రాజ్ న్యూస్ రిపోర్టర్ గా కథనాలు రఘు అందించారు. అందులో భాగంగా
బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ధర్నాను రఘు కవరేజ్ చెయ్యడంతో, బండి సంజయ్ తో పాటు రఘుపై IPC 143, 144, 147, 148, 149, 332, 333 r/w, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇది అత్యంత హేయం.
ఇదే కేసులో ఇప్పటి వరకు 40 మందికి పైగా బీజేపీ కార్యకర్తల అరెస్టులు చేస్తున్నట్లుగా, అందులో భాగంగానే రఘును పోలీసులు అరెస్టు చేసి ఉంటారని భావిస్తున్నాం.
ఇప్పటికే రఘు తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తున్నాడు.
మీడియా గొంతు నొక్కెందుకే రఘును అరెస్టు చేశారని యూనియన్ ఆఫ్ తెలంగాణ జర్నలిస్ట్స్ రాష్ట్ర కమిటి ఆరోపిస్తున్నది.