కోవిడ్ విషయంలో ప్రధాని మోదీది మహావైఫల్యం: దేశవ్యాపిత సర్వే

 కోవిడ్ గందరగోళం, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, కుంభమేలా లతో ప్రధాని మోదీ పాపులారిటీ బాగా పడిపోయింది.

ఆరేళ్ల పాటు అజేయంగా నిలబడిన ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీ బాగా పడిపోయింది. కాశ్మీర్ కు సంబంధించి  ఆర్టికల్  370ని రద్దు చేసిన సంపాదించుకున్న పాపులారిటీ కరోనాను అదుపుచేయడంలో చేసిన తప్పులతో పటాపంచలయింది.  ABP-CVoter Modi 2.0  జరిపిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడయింది. ఈ సర్వేకోసం దేశంలోని 543 లోక్ సభ నియోజకవర్గాల నుంచి 1.39 లక్షల మందిని ఎంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫీల్డ్ వర్క్ ను  2021  జనవరి నుంచి మే  28 మధ్య నిర్వహించారు.

మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చాక   ఆర్టికిల్  370 ని రద్దు చేయడం మహా విజయం అని  47 శాతం మంది చెబితే,  కరోనా విషయంలో ప్రధాని మోదీ తప్పిదాలు మహావైఫల్యం అని  41.1 శాతం అభిప్రాయపడ్డారు.

23.1 శాతం  మోదీ వ్యవసాయం బిల్లల మీద అసంతృప్తి , ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో మోదీది రెండో మహావైఫల్యం అని వారు పేర్కొన్నారు. లాక్ డౌన్ కాలంలో కేంద్ర  ప్రభుత్వం సాయం  తమకు అందలేదని  52.3శాతం మంది చెప్పారు. సెకండ్ వేవ్ పాండెమిక్ తీవ్రంగా ఉన్నపుడు మోదీఎన్నికల క్యాంపెయిన్ చేయడం చాలా మందికి నచ్చలేదు.

సెకండ్ వేవ్ పాండెమిక్ కొనసాగుతున్నపుడు మోదీ ఎన్నికల ప్రచారం చేయడం సబబా అనే ప్రశ్నకు 59.7 శాతం  మంది  ప్రధాని తప్పు చేశారని పేర్కొన్నారు.

అయితే, మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించినా, వోటర్లెవరూ రాహుల్ ని ప్రత్యామ్నాయంగా చూడటం లేదు. మోదీ కంటే రాహుల్ గాంధీ కోవిడ్ ను అదుపు చేయడంలో బాగా పనిచేసి వుండేవారా అనే ప్రశ్నకు, 63.1 శాతం మంది మోదీ చేయగలిగినంత చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, యుపి పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసి ఉండాల్సింది అని  60.8 శాతం అభిప్రాయపడ్డారు.

అదే విధంగా సెకండ్ వేవ్ పాండెమిక్ ఉన్నందున  కుంభమేలాను సింబాలిక్ గా చేసి ఉండాల్సిందని 55.3 శాతం మంది చెప్పారు.

ఇటీవల పెట్రోలు డీజిల్ ధరలు పెరిగేందుకు పూర్తి బాధ్యత కేవలం కేంద్ర ప్రభుత్వానిదే అని 47శాతం మంది అభిప్రాయపడ్డారు.

లదాక్ ప్రాంతంలో చైనా దురాక్రమణకు కారణం కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే కారణమని   44.8 శాతం చెప్పారు. అయితే,  వాళ్లంతా మోదీ ప్రభుత్వం తీసుకున్న కాశ్మీర్ చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

One thought on “కోవిడ్ విషయంలో ప్రధాని మోదీది మహావైఫల్యం: దేశవ్యాపిత సర్వే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *