తెలంగాణ లో ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు లాక్ డౌన్ ఉల్లంఘన లకు సంబంధించి 7.49 లక్షల కేసులు నమోదయ్యాయి. మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులు నమెదు చేసి వారినుంచి రూ.35.81 కోట్ల జరిమానా వసూలు చేశారు.
ఈ వివరాలను డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు సమర్పించారు. ఔషధాల బ్లాక్ మార్కెట్‌పై 150 కేసులు నమోదయ్యాయని డీజీపీ తన నివేదికలో పేర్కొన్నారు.
భౌతిక దూరం పాటించనందుకు 41,872 కేసులు నమోదు చేశామన్నారు. జనం గుమిగుడినందుకు 13,867 కేసులు.. లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 2.61 లక్షల కేసులు నమోదు చేశామని డీజీపీ నివేదికలో పేర్కొన్నారు.
అలాగే లాక్‌డౌన్‌ను నిబంధనల మేరకు కఠినంగా అమలు చేస్తున్నామని ఆయన కోర్టుకు తెలిపారు.