వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు ఎన్నాళ్లీ పరుగులు?

ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ హాస్సిటల్స్ లేని కొరత తొలిసారి బయటపడింది. అన్నీ ఉన్న ఆంధ్రలో  ఏమి తక్కువో కరోనా పాండెమిక్ బయటపెట్టింది.  కోవిడ్ సంక్షోభం మొదలు కాగానే ఆంధ్ర ప్రదేశ్ లో పబ్లిక్ హెల్త్ సిస్టమ్ బలహీనలన్నీ బయటపడ్డారు. మంచివైద్యం కోసం ప్రజలు కర్నాటక,తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు పరుగుతీస్తున్నారు.

ఎమ్మెల్యేలు,ఎంపిలు,బాగా డబ్బున్నోళ్లో కోవిడ్ సోకాగానే అటు చెన్నైకో, బెంగుళూరుకో హైదరాబాద్ కో పెరుగుపెడుతున్నారు. అపోలో, కామినేని, కేర్ వంటి ఒక్క ఆసుపత్రి కూడా ఆంధ్రప్రదేశ్ లో లేకపోవడం వివిఐపిలు ఇతర రాష్ట్రాలుకే పోతుంటే, పేదలకు ప్రభుత్వాసుపత్రులే మిగిలాయి.

ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  కోవిడ్ పరిస్థితుల మీద జరిగిన సమీక్షలో చర్చకు వచ్చింది. ప్రజలిలా మంచి వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎన్నాళ్లిలా పరుగులు తీయాలి. ఈ కష్టాలు పోవాలి. రాష్ట్రంలోని ప్రతిజిల్లాలో కూడా అత్యాధునిక వైద్యం అందిచే కార్పొరేట్ ఆసుపత్రి ఏర్పాటుచేయాడానికి చర్యలు చేపట్టండని ఆయన అధికారులను  ఆదేశించారు.

రాష్ట్రంలో కార్పొరేట్ ఆసుపత్రులను భారీగా ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ హబ్ పాలసీ తీసుకురావాలని ఆయన చెప్పారు.

ఈ రోజు, రాష్ట్రంలో కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్, ఆక్సిజన్‌సరఫరాపై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్షించారు.

సమావేశంలో ఆయన ఇంకా ఏమన్నారంటే…

“మెరుగైన వైద్యం కోసం రాష్ట్ర ప్రజలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ వైద్యానికి ఎందుకు వెళ్లాల్సి వస్తోందన్నది ఆలోచించాలి. టెరిషియరీ కేర్‌ (అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యం–హైలీ స్పెషలైజ్డ్‌ మెడికల్‌ కేర్‌) కోసం వాళ్లు వెళ్తున్నారు. అందువల్ల రాష్ట్రంలో ప్రత్యేకంగా హెల్త్‌ హబ్‌లు ఏర్పాటు చేయాలి.

అన్ని జిల్లా కేంద్రాలు, మూడు కార్పొరేషన్లలో హెల్త్‌ హబ్‌లు ఉండేలా చూడాలి. జిల్లా కేంద్రాలతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రి కలుపుకుని మొత్తం 16 చోట్ల హెల్త్‌ హబ్‌లు ఉండాలి.

ఆ విధంగా రాష్ట్రంలో కనీసం 16 చోట్ల ఈ హెల్త్‌ హబ్‌లు. వీటి ఏర్పాటు కోసం ఒక్కో చోట కనీసంగా 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలి.
ఒక్కో ఆస్పత్రికి 5 ఎకరాలు చొప్పున ఉచితంగా భూమి కేటాయించాలి.

మూడేళ్లలో కనీసంగా రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు ఆ భూములు ఇవ్వాలి. దీనివల్ల కనీసంగా 80 మల్టీ, సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు వస్తాయి.వీటితో పాటు ప్రభుత్వం తరఫున కొత్తగా మరో 16 వైద్య కళాశాలలు, 16 నర్సింగ్‌ కాలేజీలు వస్తున్నాయి,”  అని జగన్ అన్నారు.

హెల్త్‌ హబ్‌లపై ఒక నెల రోజుల్లో పాలసీని తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *