రెండో డోస్ వ్యాక్సిన్ వేరే వ్యాక్సిన్ తీసుకున్నా నష్టం లేదా?
వేర్వేరు వ్యాక్సిన్ డోసులు తీసుకోవడం మీద కేంద్రం నుంచి కొంత క్లారిటీ వచ్చింది. అయితే అధికారికంగా ఇలాంటి ప్రకటన ఐసిఎఆర్ నుంచి రావాలి లేదా National Expert Group on Vaccine Administration for COVID-19 (NEGVAC) నుంచి రావాలి. అయినా పర్వాలేదు, వివరణ ఇచ్చింది నీతి ఆయోగ్ వైద్యరంగ సభ్యుడు వి. కె పాల్.
ఉత్తర ప్రదేశ్ సిద్ధార్థ నగర్ జిల్లాలో ఒక గ్రామంలో మొదట కోవిషీల్డ్ డోస్ తీసుకున్న 20 మందికి రెండో డోస్ కోవాగ్జిన్ ఇచ్చారు. ఇంతవరకు దేశంలో ఎక్కడా ఇలా జరగలేదు. మొదటి డోస్ ఏ వ్యాక్సిన్ తీసుకుంటే రెండో డోస్ అదే వ్యాక్సినే తీసుకోవాలనే భావించే వాళ్లు. ప్రభుత్వాలూ అలాగే చెబుతూ వచ్చాయి, రెండు డోసులు రెండు వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకోవచ్చనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. ఇలాంటపుడు ఉత్తర ప్రదేశ్ హెల్త్ వర్కర్లు కోవిషీల్డ్ మొదటి డోస్ తీసుకున్నవారికి కోవ్యాగ్జిన్ రెండో డోసుగా ఇచ్చారనే వార్తలు వచ్చాయి. దీని మీద వికె పాల్ వివరణ ఇచ్చారు.
రెండు వేర్వేరు కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను తీసుకున్నా తీవ్ర పరిణామాలు రావడమనేది జరగదు. నిజానికి, రెండు వేర్వేరు వ్యాక్సిన్ల ను తీసుకుంటే రోగనిరోధక శక్తి ఇంకా బలపడుతుందనే వాదన కూడా వినబడుతూ ఉంది అయితే, దీనిని దృఢమయిన అభిప్రాయానికి రావాలంటే చాలా విస్తృతమయిన పరిశోధన అవగాహన అవసరం, అని వికె పాల్ చెప్పారు.
ఉత్తర ప్రదేశ్ లోని బర్ణి హెల్త్ సెంటర్ లో రెండు గ్రామాలకు చెందిన ప్రజలకు రెండో డోస్ కోవిషీల్డ్ బదులు కోవాగ్జిన్ ఇచ్చారు.
భారతదేశంలో ఉన్న వ్యాక్సిన్ కొరత వల్ల మొదటి కోవిషీల్డ్ తీసుకున్నవారికి రెండో డోస్ సకాలంలో దొరకపోవచ్చు. అంటే 12 లేద 16 వారాలకు కూడా దొరకకపోవచ్చు. అపుడే కోవాగ్జిన్ వాడవచ్చా? ఈ ప్రశ్న చాలా మందిని పీడిస్తూ ఉంది. చాలా మంది నిపుణులు ఇలా వ్యాక్సిన్ల ను మిక్స్ చేయడం మంచిది కాదని చెబుతారు. వ్యాక్సిన్ వేర్వేరు రకాల పద్దతుల్లో తయారవుతున్నాయి. కొన్ని రకాలా వ్యాక్సిన్లు mRNA వ్యాక్సిన్లు. ఉదహారణకు అమెరికాలో వాడుతున్న ఫైజర్ వ్యాక్సిన్ mRNA వ్యాక్సిన్. భారత్ లో అందుబాటులోకి వచ్చిన రెండు వ్యాక్సిన్ సంప్రదాయ పద్దతిలో నిర్వీర్యపరిచిని కరోనావైరస్ వ్యాక్సిన్ లు. ఇవి శరీరంలోకి ప్రవేశించకా భిన్నమయిన పద్ధతుల్లో పనిచేస్తాయి. కాబట్టి వాటిని మిక్స్ చేయరాదని చాలా మంది చెబుతున్నారు. రెండో డోసుకోసం ఎన్ని రోజులయినా ఆగండిగాని,మిక్స్ చేయవద్దని వారి సలహా. అయితే, భారత్ లో దొరికే కోవిషీల్డ్, కోవాగ్జిన్లు రెండు ఒకే రకం పద్ధతిలో తయారయ్యాయి. వాటిని వాడితే తేడా రాకపోవచ్చు. అయితే, దీని మీద ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. మొదటి సారి ఈ వ్యాక్సిన్ మిక్స్ ప్రమాదకరం కాదని చెప్పింది వికెపాల్ గారే.
అమెరికాలో కూడా ఇదే సంశయం
రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను తీసుకోవచ్చా అనే అనుమానం భారత్ లోనే కాదు, అమెరికాలో కూడా ఉంది. ఈ ప్రశ్నకు అక్కడి నిపుణుల సమాధానం “వద్ధు” అని. కింది ట్వీట్ చూడండి.
అమెరికన్ యూనివర్శిటీ అఫ్ మేరీలాండ్ అప్పర్ కెసాపీకె హెల్త్ (University of Maryland Upper Chesapeake Health :UM UCH)కు చెందిన ఇన్ ఫెక్షియస్ డిసీజెస్ చీఫ్ డాక్టర్ ఫాహీమ్ యూనస్ వివరణ ఇది.
ఇలాంటి ప్రయోగాన్ని ఇప్పటివరకయితే చేయవద్దు అని డాక్టర్ యూనస్ చెబుతున్నారు. ఈవిషయం ఇంకా పరిశోధనల్లో ఉంది. అరుదుగా తప్ప రెండింటిని మిక్స్ చేయవద్దు. ఈ పరిస్థితి మారుతుంది. గుడ్డిగా రిస్క్ తీసుకోకుండా రెండు మూడు నెలలు ఆగండి అని ఆయన సలహా ఇచ్చారు.
Q: Can I take Pfizer/Astra Zeneca/JJ after getting vaccinated with Covaxin or Sinopharm etc? Can I mix and match vaccines?
As of today, I’d say no. It’s being studied. Besides rare exceptions don’t mix.
This WILL change. Wait 2-3 months instead of taking a blind risk.
— Faheem Younus, MD (@FaheemYounus) May 20, 2021