భారతదేశంలో కోవిడ్ జబ్బు కుటుంబాలను ఆర్థికంగా నాశనం చేస్తున్నది. కోవిడ్ ట్రీట్ మెంటు బాగా ఖరీదు కావడం, ఇపుడు దీనికి బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంటు కూడా తోడవడంతో కోవిడ్ చికిత్స ప్రపంచంలో అత్యంత ఖరీదయిన వైద్యంగా మారిపోయింది.
కోవిడ్ ఎమర్జన్సీ, బ్లాక్ ఫంగస్ కోసం వాడే మందులు ఒక కోటా ప్రకారమే రాష్ట్రాలకు అందుతున్నందున చాలా మంది రోగులు ఈ మందుల కోసం మార్కెట్ మీద ఆధారపడాల్సి వస్తున్నది. దీనితో ఇవన్నీ బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లిపోయాయి. ఆత్మీయులును బతికించుకోవాలనే తాపత్రయంలో చాలా కుటుంబాలను ఆస్తులను అమ్ముకుని లేదా తాకట్టుపెట్టి ఈ మందులు కొనేందుకు డబ్బు సమకూర్చుకుంటున్నాయి. ఎంతోకాలంగా అపురూపంగా కూడబెట్టుకున్న బంగారాన్ని తాకట్టుపెడుతున్నాయి.
భారతీయ రిజర్వు బ్యాంకు తాజా సమాచారం ప్రకారం గత 2020 మార్చి నుంచి ఇప్పటిదాకా బంగారు రుణాలు 82 శాతం పెరిగిపోయాయి. బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల 2020 మార్చిలో రు. 33,303 కోట్లు (4.57బిలియన్ డాలర్ల) ఉంటే 2021 మార్చి నాటికి రు. 60,464 కోట్ల (8.309 బిలియన్ డాలర్లు)కు పెరిగింది.
గోల్డ్ లోన్స్ డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఈ ఏప్రిల్ నుంచి ఇంకా పెరగింది. బ్యాంకు రుణాల కోసం వస్తున్న విచారణల్లో ప్రతిమూడింటిలో ఒకటి గోల్డ్ లోన్ గురించే ఉంది. అల్పాదాయాల వల్ల, పూచికత్తుల వల్ల చాలా మంది బంగారు తాకట్టుపెట్టాలనుకున్నారు అని స్టేట్ బ్యాంక్ కు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
“The surge in gold loans is likely to go up further. While demand for gold loan was already high even last year, we saw fresh demand from April onwards. One of every three loan queries is about gold loan. In fact, low income and lack of collateral have forced many people to opt for that.”
భారతదేశంలో బంగారానికి చాలా సాంస్కృతిక ప్రాముఖ్యం ఉంది. మత పరమయిన ప్రాధాన్యంఉంది.బంగారాన్ని ధనలక్ష్మిగా కొలుస్తారు. అందుకే బంగారాన్ని ఎంతో కొంత దాచుకునేందుకు ప్రతికుటుంబం కలలు కంటుంది. అందుకే ప్రపంచంలో బంగారు నిల్వలు అధికంగా ఉండే దేశం భారతదేశమే. ఈ అత్యతవసర ఈ బంగారం కుటుంబాలను అధుకుంటూ ఉంటుంది.కుటుంబాలు అర్థికంగా చిక్కుల్లో ఆదుకునేది బంగారమే. కోవిడ్ పాండెమిక్ భారతదేశంలో జరుగుతున్నదిదే. బంగారం మీద రుణం పొందడట చాలా సులభం. ఎలాంటి డ్యాక్యుమెంటు లేకండా నేరుగా బ్యాంకును ఆభరణాలను తీసుకువెళ్లి బంగారు ధరలో 75 శాతం దాకా రుణంగా పొందవచ్చు. ఒకవేళ బ్యాంకులు అందుబాటులో లేకపోతే కుదవ వ్యాపారాలు చేసే వాళ్లయిన అందుబాటులో ఉంటారు. రుణం పొందటం కంటే బంగారు తాకట్టు పెట్టి అత్యవసర సమయంలో డబ్బు పొందడట సులువు.
ఈ మధ్య కాలంలో బ్యాంకులు పర్సనల్ లోన్స్ ఇవ్వడం బాగా జటిలం చేశాయి. దీనికి చాలా డాక్యు మెంట్లు ఆడగుతున్నారు.కొల్లేటరల్ అడుగుతున్నారు. మొన్నమొన్నటి వరకు ఫోన్లు చేసి పర్సనల్ లోన్ తీసుకోండని సతాయించిన బ్యాంకులు ఇపుడు పర్సనల్ లోన్ అర్హతలున్నా, ఏదో ఒక సాకుతో రిజెక్టు చేస్తున్నాయి.
పాండెమిక్ కాలంలో ఇలాగే కన్య్సూమర్ డ్యూరబుల్స్ లోన్ 21.4 శాతం పడిపోయాయని రిజర్వు బ్యాంకు చెబుతూ ఉంది. చాలా మంది రానున్న ప్రమాదాలను దృష్టిలోపెట్టుకుని అనవసర వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. కన్యూమర్ డ్యూరబుల్స్ కింద 2020 మార్చిలో రు.9299 కోట్ల రుపాయల లోన్స్ ఉంటే , 2021 మార్చి నాటికి రు. 7307 కోట్లకు తగ్గిపోయాయి. ప్రజలిపుడు విలాసాలను బాగా తగ్గించుకున్నారు.
పాండెమిక్ కాలంలో భారతదేశంలో ఇంతవరకు బలపడుతూ వచ్చి మధ్య తరగతి వర్గం నుంచి 32లక్షల మంది కిందికి జారుకున్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ (Pew Research Centre)నివేదిక చెబుతూ ఉంది.
కోవిడ్ ఆస్పత్రి కేసులు ఇలా లక్షల్లో పెరుగుతాయని కోవిడ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు వూహించలేదు. కోవిడ్ ఆసుపత్రి బిల్లుల భారంతగ్గించుకునేందుకు ఇన్స్యూ రెన్స్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. దాదాపు సగం క్లెయిమ్ లను కంపెనీలు తిరస్కరిస్తున్నాయి. ఒక వేళ్ల క్లెయిమ్ అప్రూవ్ అయినా కేవలం విడుదలవుతున్న మొత్తం 60 శాతం మించడం లేదు.
ఇలా ప్రతికూల పరిస్థితులు ఎదురు కావడంతో కోవిడ్ ఆసుపత్రి బిల్లుల కోసం కుటుంబాలు బంగారాన్ని తాకట్టు పెట్టడమే, అమ్మేయడమో చేస్తున్నాయి.