బాబా రామ్ దేవ్ కు రు.1000 కోట్ల పరువు నష్టం నోటీసు

బాబా రామ్ దేవ్ మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్  వేయి కోట్ల రుపాయల పరువు నష్టం దావా వేసింది. అల్లోపతి వైద్య వ్యవస్థ గురించి రామదేవ్ అవాకులు చెవాకులు పేలుతున్నారని, ఇది అలోపతి డాక్టర్ల ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని చెబుతూ భారత దేశంలోని అల్లోపతి డాక్టర్ సంఘం ‘ఇండియన్ మెడికల్ అసోషియేసన్'(IMA)  పరువునష్టం నోటీసు పంపింది.  తాను ఆల్లోపతి వైద్యం మీద చేసిన నిందా వ్యాఖ్యల మీద 15 రోజులలో క్షమాపణలు చెప్పాలని లేదా వేయి కోట్ల  పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఐఎంఎ హెచ్చరించింది.

ఐఎంఎ ఉత్తరాఖండ్ సెక్రెటరీ అజయ్ ఖన్నా తన లాయర్  నీరజ్ పాండే ద్వారా ఈ  ఆరు పేజీల పరువు నష్టం దావాను బాబారామ్ దేవ్ కు పంపించారు.

బాబా చేసిన ప్రకటనలవల్ల ఆల్లోపతి వైద్య వ్యవస్థకు హాని జరుగుతుందని, ఈ వ్యవస్థ ప్రతిష్ట దిగజారుతుందని నోటీసులో పేర్కొన్నారు.

బాబా రామ్ దేవ్ వ్యాఖ్యలు  ఇండియన్ పీనల్ కో సెక్షన్ 499 కింద నేరపూరితమని, ఈ వ్యాఖ్యాలను ఉపసంహరించుకుంటూ 15 రోజులలో రాతపూర్వకంగా బాబా క్షమపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. అలా కాని పక్షంలో ఐఎంఎ ఉత్తరాఖండ్ లో ఉన్న ప్రతి సభ్యడికి  రు. 50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని పిటిషన్ హెచ్చరించారు. ఉత్తరాఖండ్ ఐఎంఎ లో 2 వేల మంది సభ్యులున్నారు.

ఆల్లోపతి మీద తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తప్పని ఒక వీడియ్ క్లిప్ చేసి విడుదలచేయాలని కూడా పిటిషనర్ కోరారు.

కోవిడ్ -19 చికిత్సకు అల్లోపతి మందులు వాడినందున కొన్ని లక్షల మంది చనిపోయాన్న ఆయన చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వీడియో క్లిప్ ను ఆదివారం నాడు ఉపసంహరించుకున్నారు.

ఈ వ్యాఖ్యలకు డాక్టర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్  వెంటనే రంగంలో దూకి అభ్యంతరకరవ్యాఖ్యాలనుఉపసంహరించుకోవాలని  రామ్ దేవ్ ను కోరారు.

తర్వాత రామ్ దేవ్ ట్విట్టర్ ఎక్కి  హైపర్ టెన్షన్, డయబెటీస్ వంటి రోగాలను ఆల్లోపతి శాశ్వతంగా నివారించగలదా? అంటూ  15 ప్రశ్నలను ఐఎంఎ మీద సంధించారు.

అల్లోపతి డాక్టర్లు ఒక కుట్ర ప్రకారమే బాబా మీద దాడి చేస్తున్నారని తర్వాత ఆయన శిష్యుడు  ఆచార్య బాల్ క్రిష్ణ ఆరోపించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *