కోవిడ్ మీద కోటి వీడియోలుండొచ్చుగాక, డాక్టర్ వర్గీస్ వీడియో ప్రత్యేకం

కోవిడ్ గురించి జ్ఞానం ప్రజల్లో విపరీతంగా పెరిగింది. కోవిడ్ గురించి ఎవరితోనైనా ప్రస్తావిస్తే చాలు, ప్రవాహంలో కోవిడ్ సమాచారం దుముకుతుంది. కోవిడ్ ఎలా వస్తుంది, కోవిడ్ వైరస్ చైనా ల్యాబ్ నుంచి ఎలాతప్పించుకొచ్చింది, ఇండియాకు ఎలా వచ్చింది, వైరస్ ఎలా రెట్టంవుతుంది, కోవిడ్ వస్తే ఏంచేయాలి, ఏ మాత్రలు, ఏ ఇంజక్షన్లు ఎలా వాడాలి…ఈ సమాచారం తెలియని భారతీయులు లెవ్వరూ లేరు. చదువురాని వాళ్లు కూడా ఇపుడు అజిత్రో మైసిన తీసుకున్నావా అని అడుగుతున్నారు.  ఐవర్ మెక్టిన్ మీ డాక్టర్ రాయలేదా? అని సలహాలిస్తున్నారు. కోవిడ్ జాగ్రత్తలు చెప్పేవాళ్లు మరీ ఎక్కువై పోయారు. వాటిని పాటించేవాళ్లే లేకుండా పోయారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇలా విజృంభించడానికి కారణం, ఇలా అంతా జాగ్రత్త  అని చెప్పడమే తప్ప పాటించకపోవడమే అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ నేపథ్యంలో ఒక చక్కటి వీడియో దాక్టర్ మాథ్యూ వర్గీస్ తయారు చేశారు.  కోవిడ్ జబ్బు వచ్చాక ఏం చేయాలనే దాని మీద చాలా వీడియోలుంటాయి. అనుమానం లేదు. అందులో కొన్ని చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

అయితే, డాక్టర్ వర్గీస్ వీడియో వీటికంటే భిన్నమయింది. ఇది ప్రయోజనకరమే కాదు, అర్థవంతంగా ఉంటుంది. ఎజుకేటివ్ గా ఉంటుంది. ఈ 20 నిమిషాల వీడియో ఇచ్చే సమాచారం అమూల్యమయింది.  కోవిడ్ మొదటి రోగ లక్షణం ఎపుడు మొదలయిందో  గుర్తు పెట్టుకోవడం చాలా అవసరమని ఆయన చెబుతున్నారు. అప్పటినుంచి కోవిడ్ ను ఎపుడూ ఒక కంట కనిపెడుతూ ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే మొదటి రోగలక్షణం బయట పడ్డాక అయిదారు రోజుల్లో అది   డేంజరస్ టర్న్ తీసుకుంటుంది, దానిని గుర్తించకపోతే, ప్రమాదంలో పడిపోతారు. ఇపుడు ఆసుపత్రి పాలయిన కేసులన్నీ అవేనని డాక్టర్ వర్గీస్ చెబుతారు.

కోవిడ్ జబ్బు గురించి ఈ వీడియో  విశదంగా వివరిస్తుంది. వైరస్ ను ఎలా అదుపులో పెట్టుకోవాలో చెబుతుంది. వైరస్ కట్లు తెంచుకుని పక్కదారి పట్టినపుడు ఎలా గుర్తించాలో సైగ చేస్తుంది. వైరస్ మన అదుపులో లేకుండా పోయినపుడు ప్రమాదకరమయిన బాట పడుతున్నపుడు ఏంచేయాలో వివరిస్తుంది.

కట్లుతెంచుకున్న వైరస్ తెచ్చే ముప్పేమిటి, దానికి విరుగుడేమిటి డాక్టర్ వర్గీస్ వివరంగా చెబుతారు. ఈ వీడియో చూశాక కోవిడ్ మీద మీకు కంట్రోల్ వచ్చినట్లు ధీమా కలుగుతుంది.  డాక్టర్ వర్గీస్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. తప్పక చూడాల్సిన వీడియో ఇది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *