ఒక్క కరోనా కేసు కూడా లేని గ్రామం, అదెలా సాధ్యం?

దేశమంతా కోవిడ్ తో రోజు కనిపిస్తున్న కొత్త పాజిటివ్ కేసుల్తో తల్లడిల్లీ పోతూంటే, ఈ గ్రామం మాత్రం కరోనా వైరస్ కు,  కోవిడ్ కూ దూరంగా ఉంది. ఈ వార్త రాస్తున్నంతవరకు ఈ గ్రామంలో ఒక్క కోవిడ్ కేసు కనిపించలేదు. ఇదొక విచిత్రమయితే, కరోనాను ఆమడ దూరాన ఉంచేందుకు కారణం, ప్రభుత్వాలుకాదు, రాజకీయ నాయకులూ కాదే. ఆవూరు మహిళలదే ఆ క్రెడిట్.

ఈ గ్రామం పేరు చిఖ్ లార్. మధ్య ప్రదేశ్ బేతుల్ జిల్లా కేంద్రానికి సమీపాన ఉంటుంది.

పైఫోటోని జాగ్రత్తగా కనిపిస్తే, అందులో గ్రామం నిషేధ ప్రాంతమని బ్యానర్ ఉంటుంది. పక్కనే కొంతమంది మహిళలు కర్రుల పట్టుకుని కాపలా కాయడం కూడా కనిపిస్తుంది. వాళ్లంతా కరోనా వైరస్ వూర్లోకి ప్రవేశించకుండా కాపాడున్న ప్రంట్ లైన్ వారియర్స్.

మధ్యప్రదేశ్ ను కోవిడ్ సెకండ్ వేవ్ కుదిపేస్తూ ఉంది. అయినా ఈవూర్లో ఒక కేసు కనిపించలేదు. దీనికి కారణం ఈ మహిళలదే. వూర్లోకి కరోనా రాకుండా అడ్డుకునే బాధ్యతను వూరి మహిళలు స్వీకరించారని టైమ్స్ నౌ (timesnow) రిపోర్టు చేసింది.

బయటి వాళ్లెవరూ వూర్లోకి రాకుండా వాళ్లు కర్రలు పట్టుకుని కాపలా కాస్తున్నారు. అంతేకాదు, వాళ్లు వూర్లో కూడా లాక్ డౌన్ విధించారు. వూర్లోనుంచి కూడా ఎవరూ బయటకు వెళ్లకుండా నిషేధం విధించారు.

నిజానికి ఈ వూరు నాటు సారా కు బాగా ఫేమస్. సారా అమ్ముకునేందుకు ఇక్కడి వాళ్లు బయటకు వెళ్లుతుంటారు. వీళ్లు ఈ అమ్మకాల మీద కూడా నిషేధం పెట్టారు.

వూర్లోకి వచ్చే మార్గాల దగిర వెదురు బ్యారికేడ్స్ పెట్టారు. వూరి పక్కనే హైవే వెళ్లుంది  కాబట్టి వూర్లోకి వైరస్ వచ్చే ప్రమాదమెక్కువ. అందుకే మహిళలు రంగంలోకి దిగి హైవే నుంచి ముప్పు రాకుండా కఠిన ఆంక్షలు విధించారు.

వూరంతా ‘బతుకు దెరువు’ కోసం బయటకు వెళ్లకుండా ఉండేందుకు, ఆ పని పూర్తి చేసే బాధ్యతను ఇద్దరు యువకులకు అప్పగించారు.

కఠినంగా లాక్ డౌన్ అమలు చేసి, వైరస్ ప్రవేశించే మార్గాలను మూసేస్తే కోవిడ్ బారిన ఎవరూ పడకుండా కాపాడవచ్చని తమ వూర్లో  చిన్న ప్రయోగం చేసి విజయవంతమయ్యారు. ఇలాంటి  ప్రయోగాలను, వీధుల్లో కాలనీలలో , పంచాయతీలలో, మునిసిపాలిటిలలో ఎందుకు చేయరాదు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *